సీనియర్ హీరోయిన్ల స్ట్రాటజీ, సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్రేక్ రాకుండా ఉండేందుకు కష్టపడుతున్న బ్యూటీస్
ఒకప్పుడు సీనియర్ హీరోయిన్ అనే ట్యాగ్ వస్తే అవకాశాలు తగ్గిపోయేవి. కానీ ఇప్పుడు కాజల్, తమన్నా, త్రిష, శృతి హాసన్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి స్టార్ హీరోయిన్లు ఆ ట్రెండ్‌ను మార్చేశారు. సీనియర్ హీరోలతో కమర్షియల్ సినిమాలు చేస్తూనే, లేడీ ఓరియెంటెడ్ కథల్లోనూ మెరిసి తమ స్టార్‌డమ్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు.
హీరోలు ఎంత సీనియర్ అయినా కమర్షియల్ స్టార్ అన్న ట్యాగ్‌తోనే కంటిన్యూ అవుతారు. కానీ హీరోయిన్లకు సీనియర్ అన్న ట్యాగ్ యాడ్ అయితే…. కెరీర్ క్లైమాక్స్ వచ్చేసినట్టే. ఆ ట్యాగ్ తెచ్చుకున్న వారికి యంగ్ హీరోలతోనే కాదు… సీనియర్ హీరోలతో కూడా సినిమా ఛాన్స్‌లు రావటం కష్టమైపోతుంది. కానీ ఇలాంటి సిచ్యుయేషన్ పర్ఫెక్ట్‌గా హ్యాండిల్ చేస్తున్నారు ఈ జనరేషన్ సీనియర్ బ్యూటీస్. జనరేషన్‌తో సంబంధం లేకుండా స్టార్ ఇమేజ్‌ను కంటిన్యూ చేస్తున్నారు. కాజల్, తమన్నా, త్రిష, శృతి హాసన్… ప్రజెంట్ ఫామ్‌లో ఉన్న సీనియర్ కేటగిరి హీరోయిన్స్. గతంలో అయితే సీనియర్ సెగ్మెంట్‌లోకి ఎంటర్ అయిన హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోయేవి. కానీ ఈ ఫార్ములాను బ్రేక్ చేసి చూపిస్తున్నారు ఈ బ్యూటీస్. యంగ్ జనరేషన్‌తో నటించే అవకాశాలు రాకపోయినా.. తమకంటూ వెండితెర మీద సపరేట్ స్పేస్ క్రియేట్ చేసుకుంటున్నారు. సీనియర్ హీరోయిన్ అన్న ట్యాగ్ యాడ్ అయినా… ఇప్పటికీ కమర్షియల్ ఫార్ములాతో రూపొందుతున్న సినిమాల్లోనూ నటిస్తున్నారు కాజల్, శృతి. ఏజ్ ఓల్డ్ హీరోలతో జోడికి సై అంటూ సిల్వర్ స్క్రీన్ మీద తమ ప్రెజెన్స్ ఉండేలా చూసుకుంటున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లాంటి సీనియర్ మోస్ట్ హీరోలకు ఫస్ట్ ఛాయిస్‌గా కనిపిస్తున్నారు ఈ బ్యూటీస్. గ్లామరస్ బ్యూటీస్ తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. అప్పుడప్పుడూ లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూనే కమర్షియల్ ఫార్ములా సినిమాల్లోనూ మెరుస్తున్నారు. తమన్నా బాలీవుడ్ ప్రాజెక్ట్ మీద కాన్సన్‌ట్రేట్ చేస్తుంటే, త్రిష సౌత్‌లో సీనియర్ హీరోస్‌ను కవర్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏంటి? పవన్ సినిమాలో ఛాన్స్ వస్తే వదులుకుందా?
V. V. Vinayak: ఆ సినిమా చేసి తప్పు చేశా.. వినాయక్ భావోద్వేగం
Naga Durga: బిగ్ బాస్ బంపర్ ఆఫర్.. కానీ.. ఇడుపు కాయితం ఫేమ్ నాగ దుర్గ షాకింగ్ రీజన్
Naga Vamsi: బుక్‌మైషో బండారం బయటపెట్టిన నాగ వంశీ..
బిగ్ స్క్రీన్ మీద బిగ్ చేంజ్… ఆడియన్స్ టేస్ట్ మారుతోందా..?
ఇంటి పెరట్లో వింత శబ్దాలు.. వెళ్లి చూసిన ఓనర్ వెన్నులో వణుకు!
సముద్ర తీరంలో వింత వస్తువులు.. అంతరిక్షం నుంచి వచ్చినట్టుగా
మొబైల్ టార్చ్‌లైట్ వెలుగులో బస్సు నడిపిన డ్రైవర్
దేవుడా.. ఈ నగరానికి ఏమైంది.. ఓవైపు కోతులు..మరోవైపు శునకాల బీభత్సం
ప్రాచీన శివాలయానికి జాతీయ హోదా!
చైనాలో గుడ్డు కూర ధర ఎంతో తెలుసా?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ..

