AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జామియా ఘటన.. క్రిమినల్స్ లా విద్యార్థుల చేతులు పైకి ఎత్తించి …

అది ఈ నెల 15 వ తేదీ.. ఆదివారం.. ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులు దాదాపు ఆరేడు గంటలపాటు నరకం అనుభవించారు. పౌరసత్వ చట్టాన్ని నిరసిస్తూ కేవలం కొంతమంది విద్యార్థులు ప్రారంభించిన ఆందోళన కొద్దిసేపటిలోనే విశ్వవిద్యాలయమంతా వ్యాప్తి చెందింది. యూనివర్సిటీ లైబ్రరీలో ప్రశాంతంగా బుక్స్ చదువుకుంటున్న విద్యార్థులకు మొదట ఏం జరుగుతోందో అర్థం కాలేదు. లైబ్రరీ భవనం బయటికి వచ్చి అసలు విషయమేమిటో తెలుసుకుందామని అనుకునేలోగానే బిలబిలమంటూ పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.ఆ […]

జామియా ఘటన.. క్రిమినల్స్ లా విద్యార్థుల చేతులు పైకి ఎత్తించి ...
Pardhasaradhi Peri
|

Updated on: Dec 17, 2019 | 2:38 PM

Share

అది ఈ నెల 15 వ తేదీ.. ఆదివారం.. ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులు దాదాపు ఆరేడు గంటలపాటు నరకం అనుభవించారు. పౌరసత్వ చట్టాన్ని నిరసిస్తూ కేవలం కొంతమంది విద్యార్థులు ప్రారంభించిన ఆందోళన కొద్దిసేపటిలోనే విశ్వవిద్యాలయమంతా వ్యాప్తి చెందింది. యూనివర్సిటీ లైబ్రరీలో ప్రశాంతంగా బుక్స్ చదువుకుంటున్న విద్యార్థులకు మొదట ఏం జరుగుతోందో అర్థం కాలేదు. లైబ్రరీ భవనం బయటికి వచ్చి అసలు విషయమేమిటో తెలుసుకుందామని అనుకునేలోగానే బిలబిలమంటూ పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.ఆ హడావుడి చూసి కొంతమంది విద్యార్థులు భయపడి టేబుళ్ల కింద దాక్కున్నారు. మరికొంతమంది ధైర్యంగా ముందుకు రాబోగా.. పోలీసులు వారిని అడ్డుకుని లాఠీచార్జి చేశారు. అంతేకాదు.. బాష్పవాయువు ప్రయోగించారు. టేబుళ్ల కింద దాక్కున్నవారిని కూడా ఈడ్చుకు వచ్చారు. బాష్పవాయువు కారణంగా అనేకమంది కళ్ళు మంటలు పుట్టాయి. పొగకు ఉక్కిరిబిక్కిరయ్యారు. కొంతమంది స్పృహ కోల్పోయారు. అయినా పోలీసులు వదలలేదు. విద్యార్థులను బలవంతంగా బయటకు నడిపించారు.. మామూలుగా కాదు.. ఖైదీల మాదిరిగానో, క్రిమినల్స్ మాదిరో వారిని పరిగణిస్తూ రెండు చేతులూ పైకి ఎత్తించి.. దగ్గరలోని మెట్రో స్టేషను వరకూ వారిని నడిపించారు. అక్కడినుంచి సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. చివరకు సాయంత్రం చీకటి పడుతుండగా వారిని వదిలివేశారు.పైగా.. తిరిగి యూనివర్సిటీ వైపు చూడవద్దని హెచ్ఛరించారట. ఇదంతా హర్యానాకు చెందిన ఓ విద్యార్థికి కలిగిన దారుణమైన అనుభవమట. ఈ విద్యార్థుల నిరసన చూసి యూపీ లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా వీధుల్లోకి వచ్చారు.ప్లకార్డులు చేత బట్టుకుని.. నినాదాలు చేస్తూ కదిలారు. అంతటితో ఈ దుమారం ఆగలేదు.

మరుసటిరోజు సోమవారం ఉదయం.ఆరు గంటల సమయం.. . నగరంలోని పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద కొంతమంది విద్యార్థులు వణికిస్తున్న చలిలోనే చొక్కాలు విప్పి అర్ధనగ్న ప్రదర్శనకు పూనుకొన్నారు. ఇందుకు నిరాకరించిన వారిని ‘ బలమైన విద్యార్ధి నాయకులు ‘ బలవంతంగా ఒప్పించారు. అయితే తమ ఉద్యోగాలకు, తమ భవిష్యత్తుకు హానికరమైన పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకించే క్రమంలో ఈ నిరసన ఏపాటి అన్న విద్యార్థులు కూడా ఉన్నారు. చివరకు ఈ యూనివర్సిటీ విద్యార్థుల నిరసన దేశవ్యాప్తమైంది. అనేక చోట్ల విశ్వవిద్యాలయ విద్యార్థులు, ఐఐటీ అభ్యర్థులు సైతం తమ తరగతులను బాయ్ కాట్ చేసి ఆందోళనకు దిగారు. ఢిల్లీలో ప్రారంభమైన ఈ ఆందోళన , యూపీ, కర్నాటక, మహారాష్ట్ర, తదితర రాష్ట్రాలకు కూడా ఈ సెగ తాకింది.