బీచ్‌లో ‘చేపలకు సమాధి’కి.. కారణం మనుషులేనట!
మనుషులకే కాదు.. చేపలకు కూడా స్మశానవాటిక ఉంటుంది. చేపలకు స్మశానవాటికను ఏంటా అని అవాక్కయ్యారా..? అవును.. మనిషి చనిపోతే.. వారి కులాలు, సంప్రదాయాల బట్టి దహనం, ఖననం చేయడం జరుగుతుంది. అలాగే.. చేపలను కూడా సమాధి చేస్తారట. నమ్మడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఇదంతా ఒకటైతే.. చేపలను సమాధి చేయడానికి మాత్రం కారణం మనమేనట. ఎందుకని అనుకుంటున్నారా..? అక్కడికే వస్తున్నా. సాధారణంగా సమాధులను మట్టి, ఇసుక, ఇటుకలతో నిర్మిస్తారు. కానీ ఈ జలచరాలకు మాత్రం ఒకసారి […]
మనుషులకే కాదు.. చేపలకు కూడా స్మశానవాటిక ఉంటుంది. చేపలకు స్మశానవాటికను ఏంటా అని అవాక్కయ్యారా..? అవును.. మనిషి చనిపోతే.. వారి కులాలు, సంప్రదాయాల బట్టి దహనం, ఖననం చేయడం జరుగుతుంది. అలాగే.. చేపలను కూడా సమాధి చేస్తారట. నమ్మడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఇదంతా ఒకటైతే.. చేపలను సమాధి చేయడానికి మాత్రం కారణం మనమేనట. ఎందుకని అనుకుంటున్నారా..? అక్కడికే వస్తున్నా.
సాధారణంగా సమాధులను మట్టి, ఇసుక, ఇటుకలతో నిర్మిస్తారు. కానీ ఈ జలచరాలకు మాత్రం ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగించి నిర్మిస్తారు. జీవజాతులకు ప్లాస్టిక్ ఎంత హానికరమో మనకు తెలిసిన విషయమే. ఇది సైంటిఫిక్‌గా కూడా ఫ్రూవ్ అయిన సంగతి కూడా. ఇవి ప్లాస్టిక్ కవర్లను మింగి ‘కాలుష్య భూతాలుగా’ మారడంతో.. ముఖ్యంగా రవాణా సమయంలో ఇవి మరింతగా హానికరం కావచ్చునని భావించిన వ్యాపారులు వీటి కోసం ప్రత్యేకంగా సమాధుల్లాంటివి నిర్మిస్తున్నారు. కేరళలో కోజీపూర్‌లో ఈ నెల 4న ‘మెరైన్ సిమెటరీ’ పేరిట ఈ సమాధులను నిర్మించారు. కాగా.. ప్రపంచంలోనే ఈ తరహా సమాధులను జలచరాలకు నిర్మించడం ఇదే మొట్ట మొదటిసారి. ప్లాస్టిక్‌పై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కూడా వీటికి బీచ్‌లలోనే సమాధిని నిర్మిస్తున్నారు.
సాధారణంగా.. బీచ్‌కు వచ్చే ప్రజలు పలు ప్లాస్టిక్ వ్యర్థాలను అక్కడే విడిచి వెళ్లడం వల్ల వాటిని తిని అవి ప్రాణాలు కోల్పోతున్నాయి. ముఖ్యంగా.. అంతరించిపోతోన్న సముద్ర గుర్రం, చిలుక చేప, హేమర్‌హెడ్ షార్క్, లెదర్ బ్యాక్ తాబేలు, దుగోంగ్, సా ఫిష్, జీబ్రా వంటి వాటి గుర్తులుగా ఈ స్మశాన వాటికను నిర్మిస్తున్నారు.