AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రధాని మోదీని విమర్శిస్తూ పోస్టర్ పెడితే కేసు పెడతారా, ఢిల్లీ పోలీసులపై కాంగ్రెస్ నేత జైరాంరమేష్ ఫైర్, దమ్ముందా అని సవాల్

ప్రధాని మోదీని విమర్శిస్తూ పోస్టర్ అతికిస్తే తనపై కేసు పెడతారా అని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి జైరాంరమేష్ ఢిల్లీ పోలీసులపై మండిపడ్డారు. దమ్ముంటే నాపై చర్య తీసుకోండి చూద్దాం అన్నారు. దేశంలో వ్యాక్సినేషన్ విషయంలో...

ప్రధాని మోదీని విమర్శిస్తూ పోస్టర్ పెడితే  కేసు పెడతారా, ఢిల్లీ పోలీసులపై కాంగ్రెస్ నేత  జైరాంరమేష్ ఫైర్, దమ్ముందా అని సవాల్
Jairam Ramesh Dares Delhi Police To Act Against Him For Putting Up Posters On Pm Modi
Umakanth Rao
| Edited By: |

Updated on: May 16, 2021 | 5:02 PM

Share

ప్రధాని మోదీని విమర్శిస్తూ పోస్టర్ అతికిస్తే తనపై కేసు పెడతారా అని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి జైరాంరమేష్ ఢిల్లీ పోలీసులపై మండిపడ్డారు. దమ్ముంటే నాపై చర్య తీసుకోండి చూద్దాం అన్నారు. దేశంలో వ్యాక్సినేషన్ విషయంలో మోదీ అనుసరిస్తున్న విధానాన్ని విమర్శిస్తూ ఢిల్లీలో పలు చోట్ల పోస్టర్లు వెలిశాయి. దీనిపై స్పందించిన పోలీసులు 25 మందిపై ఎఫ్ఐఆర్ లు దాఖలు చేశారు. ప్రధానిని విమర్శిస్తూ పోస్టర్ ఏర్పాటు చేస్తే అది నేరమవుతుందా ? ఈ దేశం మోదీ పీనల్ కోడ్ పై నడుస్తోందా ? ఈ కోవిడ్ పాండమిక్ సమయంలో ఢిల్లీ పోలీసులు ఉద్యోగాల్లేక ఉసూరుమంటున్నారా అని జైరాంరమేష్ ప్రశ్నించారు. రేపు తన ఇంటి ప్రహరీ గోడపై కూడా పోస్టర్లు పెడతానని, చూద్దురు గాని రండి అని ఆయన పోలీసులను, హోమ్ మంత్రి అమిత్ షాను ఉద్దేశించి ట్వీట్ చేశారు. మా పిల్లలకు ఇవ్వాల్సిన వ్యాక్సిన్ ని విదేశాలకు ఎందుకు పంపారు అని సెటైరికల్ గా ప్రధానిని విమర్శిస్తూ ఇటీవల నగరంలో కొంతమంది వ్యక్తులు పోస్టర్లను అతికించారు. అయితే ఇవి ప్రధానమంత్రిని విమర్శించేవిగా ఉన్నాయని భావించిన పోలీసులు డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టం, ఇండియన్ పీనల్ కోడ్ లోని కొన్ని చట్టాల కింద కేసులు ఫైల్ చేశారు. ఇప్పటికే దేశంలో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఏర్పడగా ఇప్పుడు ఈ పోస్టర్స్ అధికార బీజేపీకి తలనొప్పిగా మారాయి.

మరిన్ని చదవండి ఇక్కడ : Ward boy rapes Covid patient video: హాస్పిటల్ లో కరోనా పేషేంట్ పై వార్డ్ బాయ్ లైంగిక దాడి వైరల్ వీడియో..

Raghu Rama Krishna Raju : రఘురామకృష్ణంరాజుకు హై కోర్ట్ షాక్ బెయిల్ నిరాకరణ..!(వీడియో).

 నోయిడాలో మాటలకందని విషాదం.. పెద్ద కొడుక్కి అంత్యక్రియలు చేసొచ్చేలోగా చిన్నకొడుకు మృతి!కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో ..:coronavirus video.

దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..