భారత్ మానవ సహిత రాకెట్ ప్రయోగం ఎప్పుడంటే..? ఇస్రో ఎన్ని ఉపగ్రహాలను ప్రయోగించిందో తెలుసా..?

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఎప్పుడు ఏర్పడిందో తెలుసా..? ఇప్పటి వరకు ఎన్ని ఉపగ్రహాలను ప్రయోగించిందో తెలుసా..? మానవ సహిత రాకెట్ ప్రయోగం ఎప్పుడంటే..?

భారత్ మానవ సహిత రాకెట్ ప్రయోగం ఎప్పుడంటే..? ఇస్రో ఎన్ని ఉపగ్రహాలను ప్రయోగించిందో తెలుసా..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 12, 2020 | 4:30 PM

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. డిసెంబర్ 17న పీఎస్ఎల్వీ సీ50 ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. ఇప్పటికే పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా 41 కమ్యూనికేషన్ ఉపగ్రహాలను కక్షలోకి పంపింది ఇస్రో. తాజాగా సీ50 ద్వారా మరో 42 కమ్యూనికేషన్ ఉపగ్రహాలను పంపేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇస్రో పుట్టుక, అభివృద్ధి చేపట్టిన ప్రయోగాలు, విజయాలు, అపజయాలు, సంచలనాల గురించి తెలుసుకుందాం….

బెంగళూరు కేంద్రంగా ఏర్పాటు…

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్‌ను అంతరిక్ష పరిశోధనల కోసం భారత ప్రభుత్వం నెలకొల్పింది. ఈ సంస్థ దేశాభివృద్ధి లక్ష్యంగా అంతరిక్ష విజ్ఞానాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఏర్పాటై, ప్రస్తుతం ప్రపంచంలోని అంతరిక్ష రంగ సంస్థల్లో ఒకటిగా పేరొందింది. బెంగుళూరు కేంద్రంగా ఏర్పాటైన ఇస్రో, దేశంలోని వివిధ ప్రదేశాల్లో పరిశోధన, అభివృద్ధి సౌకర్యాలు కలిగి ఉంది. ఇస్రో లోగోలో పైకి గురి పెట్టిన బాణం గుర్తు రాకెట్టును, అటూ ఇటూ ఉన్న సౌర ఫలకాలు ఉపగ్రహాన్నీ సూచిస్తాయి.

సోవియట్ యూనియన్ నుంచి ఆర్యభట్ట ప్రయోగం….

ఇస్రో తన మొదటి అంతరిక్ష నౌకని ఏప్రిల్ 19, 1975న ప్రయోగించింది. దాని పేరు ఆర్యభట్టను. ఈ ఉపగ్రహాన్ని భారత ప్రభుత్వం సోవియట్ యూనియన్ నుంచి ప్రయోగించింది. కాగా, 1979 నాటికి శ్రీహరికోట నుంచి అంతరిక్ష ప్రయోగాలు చేయడం భారత్ మొదలుపెట్టింది. కాగా, భారత్ మొదటగా ఎస్సెల్వీ ప్రయోగం చేసింది. అయితే అది రెండవ దశలో ఎదురయిన సమస్యతో విజయవంతం కాలేదు. ఎస్సెల్వీ రాకెట్‌లోని లోపాలను సరిదిద్ది 1980లో విజయవంతంగా ప్రయోగించింది ఇస్రో. ఎస్సెల్వీతో రోహిణి-1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలో భారత్ ప్రయోగించింది. అయితే భారత్ నుంచి ప్రయోగించిన తొట్టతొలి ఉపగ్రహం అదే. 1987లో, 1988లో చేసిన ASLV ప్రయోగాలు రెండూ విఫలం అయ్యాయి. ఆ తర్వాత 1992లో ASLV ప్రయోగం విజయవంతం అయ్యింది. తక్కువ బరువు ఉన్న ఉపగ్రహాలను మాత్రమే ఇస్రో ప్రయోగించింది. 1993లో PSLV ప్రయోగం విఫలం మళ్లీ విఫలమైంది. 1994లో చేసిన PSLV ప్రయోగం విజయవంతంగా ప్రయోగించబడింది.

దశాబ్దాల వారీగా పీఎస్ఎల్వీ ఉప్రగ్రహాల ప్రయోగ వివరాలు…

దశాబ్దాల వారీగా..    జయప్రదం      పాక్షిక విజయం     వైఫల్యాలు     మొత్తం 1990-2000                              3                              1              1                       5 2000 -10                                 11                             0               0                     11 2010 – 20                               24                              0              1                      25

దశాబ్ది వారీగా జీఎస్ఎల్వీ ప్రయోగ వివరాలు…

దశాబ్ది                          జయప్రదం                   పాక్షిక విజయం        వైఫల్యాలు        మొత్తం 2000లు                                      3                                    1                           1                      5 2010లు                                       4                                   0                           2                      6

జియోసింక్రొనస్ ఉపగ్రహ వాహక నౌక మార్క్ 3 (జీఎస్ఎల్వీ 3)

దశాబ్ది వారీగా జీఎస్ఎల్వీ మార్క్ 3 ప్రయోగ వివరాలు

దశాబ్ది                   జయప్రదం                పాక్షిక విజయం          వైఫల్యాలు            మొత్తం 2010                                 2                                   0                            0                           2

ఇస్రో ప్రయోగించిన కొన్ని ఉపగ్రహాలు వాటి వివరాలు….

క్రమ సంఖ్య                               శాటిలైట్                           ప్రయోగించిన తేదీ 1                                     INSAT-1A                                      10 ఏప్రిల్, 1982 2                                    INSAT-1B                                       30 ఆగష్టు, 1983 3                                    INSAT-1C                                       22 జూలై, 1988 4                                    INSAT-1D                                      12 జూన్, 1990 5                                    INSAT-2A                                     10 జూలై, 1992 6                                    INSAT-2B                                     23 జూలై, 1993 7                                    INSAT-2C                                    7 డిసెంబర్, 1997 8                                   INSAT-2D                                   4 జూన్, 1997 9                                  INSAT-2DT                                అంతరిక్షంలో కొనుగోలు చేయబడినది 10                                INSAT-2E                                   3 ఏప్రిల్, 1999 11                                INSAT-3A                                   10 ఏప్రిల్, 2003 12                              INSAT-3B                                    22 మే, 2000 13                              INSAT-3C                                  24 జనవరి, 2002 14                            KALPANA-1                               12 సెప్టెంబర్, 2002 15                            GSAT-2                                           8 మే, 2003 16                           INSAT-3E                                      28 సెప్టెంబర్, 2003 17                          EDUSAT                                       20 సెప్టెంబర్, 2004 18                          INSAT-4A                                   22 డిసెంబర్, 2005 19                         INSAT-4C                                   10 జూలై, 2006 20                        INSAT-4B                                  12 మార్చి, 2007 21                          INSAT-4CR                             2 సెప్టెంబరు, 2007 22                      GSAT-7                                     30 ఆగష్టు, 2013

ఇస్రో ప్రస్థానంలో మైలురాళ్ళు

2005లో రెండో లాంచ్ ప్యాడు ఆపరేషన్ ప్రారంభం 2008లో చంద్రయాన్ ప్రయోగం 2014లో మంగళ్యాన్ ప్రయోగం… అంగారక గ్రహాన్ని మొదటి ప్రయత్నంలోనే విజయవంతంగా చేరుకున్న ఏకైక అంతరిక్ష సంస్థగా ఇస్రో ఆవిర్భవించింది. 2016లో పునర్వినియోగ లాంచి వాహనపు తొలి పరీక్ష విజయవంతమైంది 2016లో ఒకే రాకెట్టుతో 20 ఉపగ్రహాల ప్రయోగం, అప్పటి అన్ని ఉపగ్రహాలను పంపడం ఇస్రోకు మొదటి సారి… అప్పటి వరకు అదే అత్యధిక ఉపగ్రహాల రికార్డు 2017లో ఒకే రాకెట్టుతో 104 ఉపగ్రహాల ప్రయోగం, ఇది ప్రపంచ రికార్డుగా నమోదైంది. 2017లో జీఎస్ఎల్వీ మార్క్ 3 ప్రయోగం విజయవంతమైంది. దీనిలో విశిష్టత ఏంటంటే దేశీయంగా అభివృద్ధి చేసిన అత్యంత శక్తివంతమైన క్రయోజెనిక్ ఇంజను కావడం 2007లో నుంచే గగన్యాన్ ప్రాజెక్టు. దీని ద్వారా మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలకు ఇస్రో శ్రీకారం చుట్టింది. కానీ, నిధుల కొరతతో ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. అయితే ఇస్రో దగ్గరున్న శక్తిమంతమైన జీఎస్ఎల్వీ రాకెట్‌లకు మానవులను పంపే మాడ్యూల్‌ను తీసుకెళ్లే సామర్థ్యం లేకపోవడం, టన్నుల కొద్దీ బరువైన క్రూడ్ మాడ్యూల్‌ను తీసుకెళ్లే రాకెట్లు, క్రయోజనిక్ ఇంజిన్లు లేవు అయితే ఇస్రో మాత్రం ఆ దిశగా ప్రయోగాలు కొనసాగించింది. 2014లో తయారు చేసిన జీఎస్ఎల్వీ మార్క్ టూతో క్రయోజనిక్ ఇంజన్ సమస్య తీరింది. జీఎస్ఎల్వీ మార్క్ త్రీ కూడా ప్రస్తుతం సిద్ధంగా ఉంది. దీంతో ఇస్రో మరోసారి గగన్‌యాన్ ప్రయోగం తెరపైకి తీసుకొచ్చింది. చంద్రయాన్-2 మాడ్యూల్‌ను జీఎస్ఎల్వీ మార్క్ త్రీ తో కలిపి ప్రయోగించింది.

మానవసహిత అంతరిక్ష యాత్ర విశేషాలు…

ఇండియన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ పేరుతో భారత్ మానవ సహిత అంతరిక్ష యాత్ర ప్రయోగాన్ని 2017లో మళ్లీ ప్రారంభించింది. దీనిపై 2018 ఆగస్టు 15న ఎర్ర కోట నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ… భారత్ మానవసహిత అంతరిక్ష యాత్ర చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. గగన్‌యాన్ కార్యక్రమానికి 10 వేల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఇస్రో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌ను బెంగళూరులోని ఇస్రో హెడ్ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగం ద్వారా ఇద్దరు లేదా ముగ్గురు భారతీయ వ్యోమగాముల్ని ఏడు రోజులు పాటు అంతరిక్షంలోకి పంపడం, తిరిగి వారిని క్షేమంగా వెనక్కి రప్పించేలా గగన్‌యాన్ తొలి ప్రయోగాం రూపకల్పన చేస్తున్నారు. దీనిని 2021 డిసెంబర్ లో ప్రయోగించే ఆలోచనలో ఇస్రో ఉంది. 2019లో ఆస్ట్రోనాట్ల ఎంపికతో పాటు, ఈ బృందం అంతరిక్షానికి వెళ్లే కార్యక్రమం, తిరిగి భూమ్మీదకు వచ్చే క్రూ మాడ్యూల్‌ ప్రయోగం విజయవంతమైంది.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!