COVIDVaccine: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. ఒక్క రోజులో ఎంతమందికి టీకా వేస్తారంటే..

దేశంలో మరికొద్ది రోజుల్లో అత్యవసర వినియోగం కింద కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్ర ప్రభుత్వం..

COVIDVaccine: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. ఒక్క రోజులో ఎంతమందికి టీకా వేస్తారంటే..
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 12, 2020 | 3:28 PM

దేశంలో మరికొద్ది రోజుల్లో అత్యవసర వినియోగం కింద కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ క్రమంలో రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. సాధారణ టీకాల మాదిరిగా ఒకే రోజులు వేలమందికి కాకుండా.. ఒక్కో కేంద్రంలో రోజుకు కేవలం వంద మందికి మాత్రమే వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తరువాత పరిస్థితిని బట్టి కమ్యూనిటీ హాళ్లు, తాత్కాలిక టెంట్లను టీకా వేయడానికి వినియోగించాలని సదరు మార్గదర్శకాల్లో పేర్కొంది. కాగా, తొలుత వైద్య ఆరోగ్య సిబ్బంది, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని ప్రాధాన్యత ఇస్తూ కరోనా వ్యాక్సిన్‌ను ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం.. వ్యాక్సినేషన్‌ సెంటర్‌లో వెయిటింగ్ రూమ్, వ్యాక్సినేషన్ రూమ్, అబ్జర్వేషన్ రూమ్ ఉండాలి. వ్యాక్సినేషన్ సెంటర్‌కు వచ్చే వారికి హ్యాండ్ శానిటైజర్ అందుబాటులో ఉంచాలి. వెయిటింగ్, అబ్జర్వేషన్ గదుల్లో ఆరు అడుగుల దూరంలో కూర్చునేలా సీట్లు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఒక్కో వ్యాక్సినేషన్ కేంద్రంలో ఐదుగురు అధికారులు, ఓ గార్డ్ ఉంటారు. టీకా రూమ్‌లోకి ప్రతిసారి ఒక వ్యక్తికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులను తప్పనిసరిగా 30 నిమిషాల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచాలి. టీకా వేసుకున్న తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉత్పన్నమైనా వెంటనే వారికి చికిత్స చేయడానికి ఇది ఉపకరిస్తుంది. ఒకవేళ ఎవరికైనా దుష్ప్రభావాలు ఉత్పన్నమైతే వారిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన నిర్ధిష్ట ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలిస్తారు. అలాగే ప్రతి కేంద్రంలో టీకా అధికారులు, వ్యాక్సిన్ లబ్దిదారుల పేర్లను డిస్ప్లేపై ప్రదర్శించాల్సి ఉంటుందని కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఇక టీకా వేయించుకున్న వారి వివరాలను గోప్యంగా ఉంచుతారు.

ఇదిలాఉండగా, టీకా పంపిణీపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన రెండు రోజుల వర్క్‌షాప్‌లో పాల్గొన్న డాక్టర్ రజనీ మీడియాతో మాట్లాడారు. వ్యాక్సినేషన్‌ విషయంలో కేంద్ర తీసుకున్న నిర్ణయాలను వివరించారు. వ్యక్తుల మధ్య దూరాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాక్సినేషన్ కేంద్రాల్లో మూడు గదులు తప్పనిసరిగా ఉండాలని నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే టీకా రూమ్‌లో ప్రతిసారీ ఒక వ్యక్తికి మాత్రమే ప్రవేశం ఉంటుందని, వెయిటింగ్, అబ్జర్వేషన్ రూమ్‌లో భౌతిక దూరం పాటిస్తూ కూర్చునేలా ఏర్పాట్లు ఉంటాయన్నారు. ఇక భౌతికదూరం పరిమితుల దృష్ట్యా ప్రతి గంటకు 13-14 మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లు డాక్టర్ రజనీ చెప్పారు. ఈ లెక్కన రోజుకు 100 మందికి మాత్రమే టీకా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లు ఆమె వివరించారు.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!