Corona: కరోనా వైరస్ వ్యాప్తి.. మరోసారి కీలక నిర్ణయం తీసుకున్న పంజాబ్.. జనవరి 1వరకు ఆంక్షలు..
కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా పంజాబ్ ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న నైట్ కర్ఫ్యూని జనవరి 1 వరకు కొనసాగించనున్నట్లు ప్రకటించింది.
కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా పంజాబ్ ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న నైట్ కర్ఫ్యూని జనవరి 1 వరకు కొనసాగించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం నాడు పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. జన సంచారాన్ని నిలువరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర పోలీస్ యంత్రాంగంలో భేటీ అయిన సీఎం.. రాత్రి పూట కర్ఫ్యూని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. అలాగే డే టైమ్‌లోనూ ప్రజలు గుమి కూడకుండా చూడాలన్నారు. ఇండోర్ కార్యక్రమాల్లో 100 మంది.. ఔట్ డోర్ కార్యక్రమాల్లో 250 మందికి మించి పాల్గొనకుండా చూడాలని ఆదేశించారు. కాగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వం తమ రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ విధించుకోవచ్చంటూ సూచించిన విషయం తెలిసిందే.