జనవరిలోనే వ్యాక్సిన్.. కీలక విషయాన్ని వెల్లడించిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సీఈవో
కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్న వేళ మరోసారి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదార్ పూనావాలా కీలక విషయాన్ని వెల్లడించారు.
ప్రపంచ వ్యాస్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి ఏ మాత్రం తగ్గడం లేదు. గత కొన్ని రోజులుగా దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈ వైరస్‌కు ఎలాంటి వ్యాక్సిన్ లేని కారణంగా ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ మహమ్మారిని పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు భారత్‌తో పాటు ఇతర దేశాలు సైతం వ్యాక్సిన్ తయారీలో తలమునకలవుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్న వేళ మరోసారి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదార్ పూనావాలా కీలక విషయాన్ని వెల్లడించారు.
ఈ నెలాఖరులోనే ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్‌టీకాకు అత్యవసర అనుమతులు పొందవచ్చనే ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్‌కు ఆమోదం వచ్చిన తర్వాత వచ్చే నెలలోగా భారత్‌లో టీకా పంపిణీ ప్రారంభించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ది ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్‌బిజిపనెస్ సమ్యిట్‌లో సీరమ్ సీఈవో వ్యాక్సిన్‌పై పలు వ్యాఖ్యలు చేశారు.
అత్యవసర వినియోగానికి రెగ్యులేటర్ల అనుమతి
అత్యవసర వినియోగానికి రెగ్యులేటర్ల అనుమతి, ఆ తర్వాత దేశంలో టీకా డ్రైవ్ 2021, జనవరి నాటికి ప్రారంభం అవుతుందని ఆయన అన్నారు. ఈ వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత 2021, అక్టోబర్ నాటికి చాలా మందికి వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ప్రజలు సాధారణ జీవనం గడపవచ్చని అన్నారు. అయితే దేశంలో ఉన్న జనాభాలో తొలి దశలోనే 20 నుంచి 30 శాతం మందికి టీకా వేయాలని ఆరోగ్య మంత్రిత్వశాఖ యోచిస్తోందన్నారు. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత దాదాపు 20 శాతం మందికి వేసిన తర్వాత ప్రజల్లో విశ్వాసం పుంజుకుంటుందన్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ , అక్టోబర్ నాటికి ప్రతి ఒక్కరికీ టీకాలు అందుబాటులోకి వచ్చేఅవకాశం ఉందని భావిస్తున్నానని అభిప్రాయపడ్డారు.
అలాగే ప్రభుత్వంతో పాటు ప్రైవేటు మార్కెట్లకు కూడా వ్యాక్సిన్ల తయారీకి తాము సిద్ధమవుతున్నామని చెప్పారు. మరోవైపు అక్టోబర్ నాటికి సాధారణ జీవితం తిరిగి వస్తుందని పూనావాలా భావిస్తుండగా, రోజుకు వంద కరోనా 100 కోవిడ్ షాట్లను మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోందని అన్నారు.
ఆయా రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలు కాగా, ఆరోగ్య మంత్రిత్వశాఖ మార్గదర్శకాల ప్రకారం ఈ మేరకు ఆయా రాష్ట్రాలు మౌలిక సదుపాయాలను కల్పించనున్నాయి. అలాగే షాట్ పొందిన ప్రతి వ్యక్తి 30 నిమిషాల పాటు పర్యవేక్షిస్తారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ల తయారీకి సీరం నోవావాక్స్‌తో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. నోవావాక్స్ కోసం ఫేస్ 3 క్లినికల్ పరీక్షలను 2021 మొదటి త్రైమాసికం నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది.