గణతంత్ర వేడుకల్లో అయోధ్య రామమందిర శకటం, యూపీ సర్కార్ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్

వచ్చే ఏడాది గణతంత్ర వేడుకల్లో రామమందిర శకటం ప్రజలను ఆకట్టుకోనుంది. యూపీ సర్కార్ పంపిన రామమందిర శకట ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభించింది.

గణతంత్ర వేడుకల్లో అయోధ్య రామమందిర శకటం, యూపీ సర్కార్ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 12, 2020 | 4:42 PM

వచ్చే ఏడాది గణతంత్ర వేడుకల్లో రామమందిర శకటం ప్రజలను ఆకట్టుకోనుంది. యూపీ సర్కార్ పంపిన రామమందిర శకట ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభించింది. ‘సర్వ ధర్మ సమాభావ్‌’ థీమ్‌తో వచ్చే సంవత్సరం గణతంత్ర వేడుకల్లో శకటాలను ప్రదర్శించనున్నారు.  గణతంత్ర పరేడ్‌లో యూపీ సర్కార్ రామమందిర శకటాన్ని ప్రదర్శించనుంది. అయోధ్యలో త్వరలో నిర్మించబోయే రామమందిరం ఆకృతిని ఈ శకటంపై రూపొందించనున్నారు. దీంతో పాటు దీపోత్సవాన్ని ప్రతిబింబించే నమూనాను కూడా డిజైన్ చేస్తున్నారు. ‘అయోధ్య: కల్చరల్‌ హెరిటేజ్‌ ఉత్తరప్రదేశ్’ పేరుతో సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ శకటాన్ని రూపొందిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వివరించింది.

2017లో యూపీలో బీజేపీ పవర్‌లోకి వచ్చాక.. అయోధ్యలో ఏటా దీపావళి పండుగ రోజున సరయూ నదీ తీరాన ‘దీపోత్సవ్‌’ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది దీపోత్సవంలో భాగంగా ఆరు లక్షలకు పైగా దీపాలను వెలిగించడంతో అయోధ్య వెలుగులతో కలకలలాడింది.

Also Read : 

ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం, బాంబులా పేలిన రియాక్టర్

Bigg Boss 4 Telugu : బిగ్ బాస్ ఫినాలేకు అతిథి మహేశ్ కాదట..’మాస్ కా బాప్’ రాబోతున్నారట !

నెల్లూరు జిల్లా వెలుగొట్లపల్లిలో పొలంలో నాట్లు వేస్తున్న ఆరుగురు కూలీలకు అస్వస్థత..ఒకరు మృతి