AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrayaan-3: నిద్రావస్థలోనూ చంద్రయాన్‌-3 నుంచి సంకేతాలు!

దక్షిణ ధ్రువంపై ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌-3 నిద్రాణ స్థితిలోనూ తన పని తాను చేసుకుపోతోందా అంటే అవుననే అనిపిస్తోంది. చంద్రయాన్‌-3లో అమర్చిన పరికరాలు నిద్రాణ స్థితిలోనూ దక్షిణ ధ్రువం నుంచి లొకేషన్లు గుర్తిస్తున్నట్లు ఇస్రో అధికారులు శుక్రవారం బెంగళూరులో ధ్రువీకరించారు. అంతర్జాతీయ అంతరిక్ష ఒప్పందాల్లో భాగంగా చంద్రయాన్‌-3 ల్యాండర్‌లో నాసాకు చెందిన లూనార్‌ రికనిసెన్స్‌ ఆర్బిటర్‌ LRO ను అమర్చారు.

Chandrayaan-3: నిద్రావస్థలోనూ చంద్రయాన్‌-3 నుంచి సంకేతాలు!
Chandrayaan 3
Srikar T
|

Updated on: Jan 20, 2024 | 10:45 AM

Share

బెంగళూరు, జనవరి 20: దక్షిణ ధ్రువంపై ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌-3 నిద్రాణ స్థితిలోనూ తన పని తాను చేసుకుపోతోందా అంటే అవుననే అనిపిస్తోంది. చంద్రయాన్‌-3లో అమర్చిన పరికరాలు నిద్రాణ స్థితిలోనూ దక్షిణ ధ్రువం నుంచి లొకేషన్లు గుర్తిస్తున్నట్లు ఇస్రో అధికారులు శుక్రవారం బెంగళూరులో ధ్రువీకరించారు. అంతర్జాతీయ అంతరిక్ష ఒప్పందాల్లో భాగంగా చంద్రయాన్‌-3 ల్యాండర్‌లో నాసాకు చెందిన లూనార్‌ రికనిసెన్స్‌ ఆర్బిటర్‌ LRO ను అమర్చారు. ఇందులోని లేజర్‌ రెట్రో రెఫ్లెక్టర్‌ ఎరే ఎల్ఆర్ఏ (LRA) జాబిల్లి దక్షిణ ధ్రువంలోని లొకేషన్‌ మార్కర్‌ సేవలను పునరుద్ధరించిందని వివరించారు. డిసెంబరు 12 నుంచి ఎల్ఆర్ఏ (LRA) నుంచి తమకు సంకేతాలు అందినట్లు ఇస్రో పేర్కొంది.

చంద్రయాన్‌-3లో పలు సంస్థలకు చెందిన ఎల్ఆర్ఏ (LRA)లను అమర్చినా నాసాకు చెందిన ఎల్ఆర్ఏ (LRA) నిరంతరం పనితీరు కనబరుస్తూనే ఉందని తెలిపింది. దక్షిణ ధ్రువంలోని రాత్రి సమయాల్లో ఎల్ఆర్ఏ (LRA) పర్యవేక్షణ మొదలవుతుంది. చంద్రయాన్‌-3 నుంచి తూర్పు వైపునకు ఉన్న ఎల్ఆర్ఓ (LRO)లోని లేజర్‌ అల్టిమీటర్‌ చంద్రయాన్‌-3 ఉండే ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు గుర్తించి సంకేతాలు అందించగలుగుతుంది. ఇందులోని 8 పలకల రెట్రో రిఫ్లెక్టర్లు దక్షిణ ధ్రువంలోని వాతావరణానికి అనువుగా ఏర్పాటయ్యాయి. దాదాపు 20 గ్రాముల బరువుండే ఈ పరికరం పదేళ్ల పాటు చంద్రుని ఉపరితలంపై మనుగడ సాగించే సామర్థ్యంతో రూపొందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి