Ayodhya: అయోధ్య రామయ్య కోసం 12 లక్షల మంది నేసిన ప్రత్యేక వస్త్రాలు.!

Ayodhya: అయోధ్య రామయ్య కోసం 12 లక్షల మంది నేసిన ప్రత్యేక వస్త్రాలు.!

Anil kumar poka

| Edited By: Ravi Kiran

Updated on: Jan 19, 2024 | 9:00 PM

అయోధ్య రాముడి కోసం దేశం నలుమూలలనుంచి ఇప్పటికే ఎన్నో రకాల కానుకలు అయోధ్యకు చేరాయి. ఇంకా చేరుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌నుంచి ఇప్పటికే బంగారు పూత పాదుకలు చేరగా.. బుధవారం భారీ లడ్డూ బయలు దేరింది. ఈ నెల 22న జరగనున్న శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని కన్నులపండువగా నిర్వహించేందుకు ఇప్పటికే దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో శ్రీరాముడి కోసం ప్రత్యేకంగా నేసిన వస్త్రాలను ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు అందజేశారు.

అయోధ్య రాముడి కోసం దేశం నలుమూలలనుంచి ఇప్పటికే ఎన్నో రకాల కానుకలు అయోధ్యకు చేరాయి. ఇంకా చేరుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌నుంచి ఇప్పటికే బంగారు పూత పాదుకలు చేరగా.. బుధవారం భారీ లడ్డూ బయలు దేరింది. ఈ నెల 22న జరగనున్న శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని కన్నులపండువగా నిర్వహించేందుకు ఇప్పటికే దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో శ్రీరాముడి కోసం ప్రత్యేకంగా నేసిన వస్త్రాలను ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు అందజేశారు. ఈ ప్రత్యేక వస్త్రాలను ఏకంగా 12 లక్షల మంది భక్తులు నేశారు. మహారాష్ట్రలోని పుణెకు చెందిన హెరిటేజ్‌ హ్యాండ్‌వీవింగ్‌ రివైవల్‌ ఛారిటబుల్‌ ట్రస్టు శ్రీరాముడి కోసం రెండు పోగులు.. దో ధాగే శ్రీరామ్‌కే లియే పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా పుణె జిల్లాలోని చేనేత కార్మికులందరూ తలో చెయ్యివేసి ఈ వస్త్రాలు నేశారు. పుణె హెరిటేజ్‌ హ్యాండ్‌వీవింగ్‌ రివైవల్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ వారు ఆ వస్త్రాలను యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ చేతుల మీదుగా శ్రీరామ జన్మభూమి ట్రస్ట్‌ వారికి అందజేశారు. ఈ సందర్భంగా పుణె చారిటబుల్‌ ట్రస్ట్‌ బృందాన్ని యోగీ ఆదిత్యనాథ్‌ అభినందించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos