ప్రాణాల కంటే డబ్బు ముఖ్యమా.. ట్రాఫిక్ రూల్స్‌పై మంత్రి వివరణ!

ప్రాణాల కంటే డబ్బు ముఖ్యమా.. ట్రాఫిక్ రూల్స్‌పై మంత్రి వివరణ!

కేంద్ర హైవే & రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కొత్త ట్రాఫిక్ నిబంధనలపై స్పందించారు. కొత్త మోటార్ వెహికల్ చట్టం ప్రకారం అమలులోకి వచ్చిన భారీ జరిమానాలు ప్రజల సంక్షేమం కోసమేనని ఆయన వెల్లడించారు. కొత్తగా వచ్చిన వెహికల్ యాక్ట్‌ను అందరూ తప్పక పాటించాల్సిందేనని లేదంటే భారీ ఫైన్‌లు తప్పవని గడ్కరీ మరోసారి హెచ్చరించారు. ‘జీవితం కంటే డబ్బులు ముఖ్యమా’ అని ఆయన ప్రజలను ప్రశ్నించారు. నాగ్‌పూర్‌లో ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన భారీ […]

Ravi Kiran

| Edited By:

Sep 09, 2019 | 12:29 PM

కేంద్ర హైవే & రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కొత్త ట్రాఫిక్ నిబంధనలపై స్పందించారు. కొత్త మోటార్ వెహికల్ చట్టం ప్రకారం అమలులోకి వచ్చిన భారీ జరిమానాలు ప్రజల సంక్షేమం కోసమేనని ఆయన వెల్లడించారు. కొత్తగా వచ్చిన వెహికల్ యాక్ట్‌ను అందరూ తప్పక పాటించాల్సిందేనని లేదంటే భారీ ఫైన్‌లు తప్పవని గడ్కరీ మరోసారి హెచ్చరించారు. ‘జీవితం కంటే డబ్బులు ముఖ్యమా’ అని ఆయన ప్రజలను ప్రశ్నించారు.

నాగ్‌పూర్‌లో ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన భారీ జరిమానాల మీద వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమించిన వారే ఫైన్‌లను కడుతున్నారని.. ఉల్లఘించినప్పుడు జరిమానా కట్టాల్సిన అవసరం ఎందుకుని గడ్కరీ ప్రజలను సూటిగా ప్రశ్నించారు.

రెడ్ సిగ్నల్‌ను చాలామంది నిర్లక్ష్యంగా క్రాస్ చేయడం జరుగుతోంది. అందువల్ల ప్రతిరోజూ ఎన్నో యాక్సిడెంట్స్ సంభవిస్తున్నాయి. ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. ‘ప్రజలు చట్టానికి భయపడినప్పుడే.. రూల్స్‌ను అతిక్రమించరని ఆయన అన్నారు.

గతంలో ప్రజలు ట్రాఫిక్ రూల్స్‌ను పట్టించుకోలేదు. తక్కువ మొత్తంలో డబ్బులు కట్టి తప్పించుకునేవారు. నిబంధనలు స్ట్రిక్ట్‌గా ఉన్నప్పుడే వారి యాటిట్యూడ్‌లో మార్పు వస్తుంది.

దేశంలో ఇప్పటికే 30శాతం ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్‌లను రద్దు చేశాం. చట్టాల్లో మార్పులు తీసుకువచ్చింది కేవలం ప్రజలను కాపాడేందుకే.. వారి ప్రాణాలను కాపాడడమే మా లక్ష్యం అని గడ్కరీ తెలిపారు. ప్రజలు రూల్స్ పాటించడానికి ఎందుకంత కష్టపడుతున్నారు. దేశవ్యాప్తంగా రవాణాశాఖలో మార్పులు తీసుకొచ్చాం. ఇవన్నీ రోడ్ యాక్సిడెంట్‌లు తగ్గేలా చేస్తాయని భావిస్తున్నాం’ అని గడ్కరీ చెప్పుకొచ్చారు.

‘చట్టాల్లో మార్పులు తీసుకువచ్చింది కేవలం ప్రజలను కాపాడేందుకే. ప్రజల ప్రాణాలు కాపాడడమే మా లక్ష్యం’ అని గడ్కరీ తెలిపారు. కొత్త మోటారు వాహనాల చట్టం దేశంలో సెప్టెంబర్ 1నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. భారీ జరిమానాలు విధించిన తర్వాతే ప్రజలు లైసెన్స్‌ కోసం అప్లై చేసుకుని, హెల్మెట్స్ కొంటున్నారు. దీని వల్ల వందలాది ప్రజల ప్రాణాలు సురక్షితంగా ఉంటాయని ఆయన అన్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ఆయన తన జీవితంలోని వివిధ కోణాల గురించి మీడియాతో పంచుకున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu