‘పవర్ పాలిటిక్స్’.. బీజేపీ ‘టార్గెట్’లో ఏపీ, తెలంగాణ!

'పవర్ పాలిటిక్స్'.. బీజేపీ 'టార్గెట్'లో ఏపీ, తెలంగాణ!

బీజేపీకి వాళ్లిద్దరూ మూలస్థంభాలు… ఒకరు అర్జునుడు అయితే.. మరొకరు కృష్ణుడు.. గ్రౌండ్ ఏదైనా వీరిద్దరూ ప్రణాళికలు రచిస్తే చాలు.. ఎదుటివారు చిత్తుగా ఓడిపోవాల్సిందే. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు అనుకుంటున్నారా.? నరేంద్ర మోదీ, అమిత్‌ షాలు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ రెండోసారి కేంద్రంలో భారీ మెజార్టీతో అధికారం చేజిక్కించుకోవడంలో వీరిద్దరి కృషి ఎంతో ఉందని చెప్పాలి. దేశంతో పాటు పార్టీని ముందుంది నడిపించేది ప్రధాని నరేంద్ర మోదీ అయితే.. తనదైన వ్యూహాత్మక ప్రణాళికలతో అమిత్ షా […]

Ravi Kiran

|

Sep 09, 2019 | 11:13 AM

బీజేపీకి వాళ్లిద్దరూ మూలస్థంభాలు… ఒకరు అర్జునుడు అయితే.. మరొకరు కృష్ణుడు.. గ్రౌండ్ ఏదైనా వీరిద్దరూ ప్రణాళికలు రచిస్తే చాలు.. ఎదుటివారు చిత్తుగా ఓడిపోవాల్సిందే. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు అనుకుంటున్నారా.? నరేంద్ర మోదీ, అమిత్‌ షాలు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ రెండోసారి కేంద్రంలో భారీ మెజార్టీతో అధికారం చేజిక్కించుకోవడంలో వీరిద్దరి కృషి ఎంతో ఉందని చెప్పాలి.

దేశంతో పాటు పార్టీని ముందుంది నడిపించేది ప్రధాని నరేంద్ర మోదీ అయితే.. తనదైన వ్యూహాత్మక ప్రణాళికలతో అమిత్ షా తెర వెనక నుంచి నడిపిస్తుంటారు. పశ్చిమ బెంగాల్ లాంటి బీజేపీ ప్రాధాన్యత లేని రాష్ట్రంలో కూడా కమలదళం మెజార్టీ సాధించందంటే.. ఆ క్రెడిట్ అమిత్ షాదే. అలాంటి ఈ అపర చాణక్యుడు దక్షిణ రాష్ట్రాలపై ఫోకస్ పెట్టాడు. బీజేపీకి తెలంగాణలో కొంత ప్రాధాన్యత ఉందిగానీ ఏపీలో మాత్రం తగినంత ప్రాతినిధ్యం లేదు. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీకి ప్రాధాన్యత కలిగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అమిత్ షా.

2024 ఎన్నికలను టార్గెట్‌గా పెట్టుకుని దేశవ్యాప్తంగా బీజేపీని బలమైన శక్తిగా చేయాలనే ఉద్దేశంతోనే అమిత్ షా పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే గవర్నర్ నరసింహన్‌ను తొలగించి ఆయన ప్లేస్‌లో తమిళిసై సౌందరాజన్‌ను తెలంగాణకు కొత్త గవర్నర్‌గా బాధ్యతలను అప్పజెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో కేసీఆర్‌కు అంతగా సఖ్యత లేకపోవడం… కేసీఆర్ పాలనను దృష్టిలో పెట్టుకునే ఆయనకు ధీటైన మహిళనే రంగంలోకి దించింది బీజేపీ.

ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం బీజేపీ తగినంత ప్రాధాన్యత సాధించలేకపోతోంది. అందుకు చాలానే కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా విభజన అనంతరం ఇస్తామన్న స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోవడం ఏపీలో బీజేపీ ఖాళీ కావడానికి కారణమైంది. ఆ తర్వాత ఎంత ప్రయత్నం చేసిన బీజేపీ పుంజుకోలేదు. కృష్ణంరాజు వంటి సీనియర్ నేతలు ఏపీలో బీజేపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నా వారిని కాదని బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఏపీకి నూతన గవర్నర్‌గా నియమించింది.

అటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించి వైఎస్‌ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. గత ముఖ్యమంత్రి చంద్రబాబు మాదిరి కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కేంద్రంతో సఖ్యతగా ఉంటూ రాష్ట్రానికి కావలసిన నిధులను తీసుకుంటున్నారు. స్పెషల్ స్టేటస్ అనే అంశం తప్ప.. రాష్ట్రానికి ఏవిధమైన సహాయం చేయడానికి సిద్ధమేనని బీజేపీ తెలిపింది. మరి ఇలాంటి తరుణంలో ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు అమిత్ షా ఎలాంటి వ్యూహాత్మక ప్రణాళికను సిద్ధం చేస్తారో వేచి చూడాలి.

మరోవైపు నరేంద్రమోదీ జమిలి ఎన్నికలపై గురి పెట్టిన సంగతి తెలిసిందే. 2022లో లోక్‌సభకు, అన్ని అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించి దేశవ్యాప్తంగా కాషాయ జెండా రెపరెపలాడేలా చేయాలని బీజేపీ యోచిస్తోంది. దీంతో.. ఈ ఏడాది ఆఖరిలో జరిగే మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్‌లలో జరిగే అసెంబ్లీ ఎన్నికలే విడిగా జరిగే తుది ఎన్నికలవుతాయని, వీటికి కూడా మరో మూడేళ్లలో మళ్లీ జమిలి ఎన్నికల్లో భాగంగా ఎన్నికలు జరగక తప్పదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కాబట్టి భవిష్యత్తులో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu