వాహనదారులకు మరో షాకింగ్ న్యూస్…

వాహనదారులకు మరో షాకింగ్ న్యూస్...

రోడ్డు ప్రమాదాలను అరికట్టడం కోసం హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాలన్న నిబంధనను కేంద్రం కఠినతరం చేసింది. అయితే వాహనదారులు మాత్రం ఈ నిబంధన కేవలం తూతూ మంత్రంగా లైట్ తీసుకుంటున్నారు. నగరంలో చాలామంది టోపీల మాదిరి ఉన్న హాఫ్ హెల్మెట్లను ధరించడం ద్వారా నిబంధనలకు తూట్లు పొడవడం రివాజుగా మారింది. ఇందుకు అడ్డుకట్ట వేసేందుకు బెంగళూరు పోలీసులు సరికొత్త రూల్‌ను ప్రవేశపెట్టారు. ఇకపై టోపీలను పోలిన హాఫ్ హెల్మెట్లను ధరించరాదని తప్పనిసరిగా ఐఎస్ఐ లేదా తత్సమానమైన ఫుల్ హెల్మెట్లు ధరించాలని, […]

Ravi Kiran

|

Sep 09, 2019 | 11:21 AM

రోడ్డు ప్రమాదాలను అరికట్టడం కోసం హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాలన్న నిబంధనను కేంద్రం కఠినతరం చేసింది. అయితే వాహనదారులు మాత్రం ఈ నిబంధన కేవలం తూతూ మంత్రంగా లైట్ తీసుకుంటున్నారు. నగరంలో చాలామంది టోపీల మాదిరి ఉన్న హాఫ్ హెల్మెట్లను ధరించడం ద్వారా నిబంధనలకు తూట్లు పొడవడం రివాజుగా మారింది. ఇందుకు అడ్డుకట్ట వేసేందుకు బెంగళూరు పోలీసులు సరికొత్త రూల్‌ను ప్రవేశపెట్టారు. ఇకపై టోపీలను పోలిన హాఫ్ హెల్మెట్లను ధరించరాదని తప్పనిసరిగా ఐఎస్ఐ లేదా తత్సమానమైన ఫుల్ హెల్మెట్లు ధరించాలని, లేని పక్షంలో భారీ జరిమానాలు తప్పదని జాయింట్ పోలీస్ కమిషనర్ డాక్టర్ బీ ఆర్ రవికాంత్ గౌడ్ శుక్రవారం హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టం తప్పించడానికే ఈ నిబంధన అని అన్నారు.

మరోవైపు వాహనం వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలని కేంద్రం స్ట్రిక్ట్ రూల్ పెట్టింది. వాహనదారుల సంరక్షణ కొరకు ఈ నిబంధన ప్రవేశ పెట్టినప్పటికీ ప్రజలు దీన్ని సరిగ్గా పాటించకపోవడం బాధాకరమన్నారు. అంతేకాకుండా పోలీసులు కూడా ఈ నిబంధనను ఉల్లఘించరాదని.. వారికి కూడా భారీ జరిమానాలు తప్పవని ఆయన హెచ్చరించారు. కాగా టోపీలాంటి హెల్మెట్‌ ధరించేవారికి జరిమానా విధించేందుకు చట్టంలో అవకాశం ఉందని, అందువల్ల ఇకపై ఈ నిబంధన కఠినతరంగా అమలు చేయనున్నట్లు పడమటి విభాగం డీసీపీ సౌమ్యలత వెల్లడించారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu