ఇండోనేషియా కరెన్సీపై ఇప్పటికీ గణపతి రూపాన్ని ముద్రిస్తున్నారా.? కేజ్రీవాల్ వ్యాఖ్యల నేపథ్యంలో తెరపైకి అంశం.. నిజమేంటంటే..
దేశంలో కరెన్సీ నోట్లపై దేవుళ్ల రూపాలను ముద్రించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసిన అంశం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కొత్త కరెన్సీ నోట్లపై మహాత్ముడి చిత్రంతో పాటు లక్ష్మీ, విఘ్నేశ్వరుడి రూపాలను ఉంచాలని కోరారు....
దేశంలో కరెన్సీ నోట్లపై దేవుళ్ల రూపాలను ముద్రించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసిన అంశం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కొత్త కరెన్సీ నోట్లపై మహాత్ముడి చిత్రంతో పాటు లక్ష్మీ, విఘ్నేశ్వరుడి రూపాలను ఉంచాలని కోరారు. అంతటితో ఆగకుండా.. ‘దేవతల చిత్రాలు ఉంచడం వల్ల దేశం అభివృద్ధి మార్గంలో పయనిచేందుకు ఉపయోగపడుతుంది. మనం శ్రమించినా.. దైవం ఆశీస్సులు లేకపోతే మన ప్రయత్నాలు ఫలించవు. అందుకే నోట్లపై వారి రూపాలు చిత్రించాలని ప్రధానిమోదీని అభ్యర్థిస్తున్నాను’ అంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు చేసే క్రమంలో కేజ్రీవాల్ లేవనెత్తిన ఓ అంశం ఇప్పుడు చర్చకు దారి తీసింది. ‘ఇండోనేషియాలో ముస్లిం జనాభా అధికంగా ఉన్నప్పటికీ.. ఆ దేశ నోట్లపై గణేశుడి చిత్రం ఉంటుంది. ఇండోనేషియానే చేయగలిగినప్పుడు.. మన వల్ల ఎందుకు కాదు..?’ అని కేజ్రీవాల్ చేసిన అంశం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో ఇండోనేషియాకు చెందిన 20,000 ఇండోనేషియన్ రూపియా కరెన్సీ నోటుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ కరెన్సీపై ఇండోనేషియా మాజీ విద్యా శాఖమంత్రి హడ్జర్ దేవంతరా ఫొటోతో పాటు విఘ్నేశ్వరుడి రూపం కూడా ముద్రించారు.
అయితే ఇండోనేషియాలో నిజంగా ఇప్పటికీ ఈ కరెన్సీ నోటు చెలమాణీ అవుతోందా.? ఈ నోటును అస్సలు ఎప్పుడు ప్రవేశ పెట్టారు? లాంటి విశేషాలు ఇప్పుడె తులసుకుందాం.. గణపతి రూపంతో ఉన్న కరెన్సీ నోటును బ్యాంక్ ఆఫ్ ఇండోనేషియా తొలిసారి 1998లో ప్రవేశపెట్టింది. అయితే ప్రస్తుతం ఈ కరెన్సీ చెలామణీలో లేదు. ఈ నోటుతో పాటు మరో మూడు నోట్లను ఇండోనేషియా ప్రభుత్వం 2008 డిసెంబర్ నుంచి రద్దు చేసింది. ప్రస్తుతం చెలామణీలో ఉన్న 2000 ఇండోనేషియ రూపీ కరెన్సీపై ఆ దేశ తొలి గవర్నర్ ఫొటోను ముద్రించారు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోన్న కరెన్సీ నోటు ఇండోనేషియాలో ఒకప్పుడు చెలామణీలో ఉండేది, ఇప్పుడు లేదని తేలిపోయింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..