AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదో అద్భుతం..! ఏడు నెలలుగా అపస్మారక స్థితిలో ఉన్న గర్భిణి.. అందమైన ఆడపిల్లకు జన్మనిచ్చింది..

భార్య భర్తలు హెల్మెట్‌ ధరించకపోవడంతో ఆమె తలకు తీవ్రగాయాలయ్యాయి. ఆమె ప్రాణాలతో బయటపడింది. కానీ, కళ్లు తెరవడం తప్ప శరీరాన్ని ఒక ఇంచు మాత్రం కూడా కదిలించలేదు. 

ఇదో అద్భుతం..! ఏడు నెలలుగా అపస్మారక స్థితిలో ఉన్న గర్భిణి.. అందమైన ఆడపిల్లకు జన్మనిచ్చింది..
Baby (Representative Image)
Jyothi Gadda
|

Updated on: Oct 28, 2022 | 6:07 PM

Share

ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఓ మహిళ అపస్మారక స్థితిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ అరుదైన ఘటన వైద్య రంగానికి ఒక అద్భుతం కంటే తక్కువేమీ కాదంటున్నారు. 23ఏళ్ల మహిళ గత ఏడు నెలలుగా ఆస్పత్రిలోనే అపస్మారక స్థితిలో ఉంది. అయితే, ఆమె కుటుంబం సంకల్ప శక్తి, వైద్యుల కృషి ఫలించింది. ఆ గర్భిణీ అందమైన ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

బులంద్‌షహర్‌కు చెందిన ఓ మహిళ తన భర్తతో కలిసి బైక్‌పై వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. దాంతో ఆమె తలకు బలమైన దెబ్బ తగిలింది. అప్పటి నుంచి ఆమె అపస్మారక స్థితిలోనే ఉండిపోయింది. ప్రమాదం జరిగినప్పుడు ఆమె ఒకటిన్నర నెలల గర్భిణీ. ఆమె మార్చి 31న ఆస్పత్రిలో చేరింది. భార్య భర్తలు హెల్మెట్‌ ధరించకపోవడంతో ఆమె తలకు తీవ్రగాయాలయ్యాయి. ఆమె ప్రాణాలతో బయటపడింది. కానీ, కళ్లు తెరవడం తప్ప శరీరాన్ని ఒక ఇంచు మాత్రం కూడా కదిలించలేదు.

నేటికి ఆమె ఎలాంటి సూచనలను పాటించలేకపోతోంది. హెల్మెట్‌ ధరించి ఉంటే ఈ రోజు ఆమె జీవితం మరోలా ఉండేదని ఎయిమ్స్‌ వైద్యులు తెలిపారు. మహిళ భర్త డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే, గర్భవతి అయిన భార్యను చూసుకోవడం కోసం ఉద్యోగం మానేశాడు. ఆమె గర్భవతి అని డాక్టర్‌ తెలుసుకున్న వెంటనే, పిండాన్ని ఉంచలా వద్దా అనే విషయం పూర్తిగా ఆమె కుటుంబ సభ్యులపై ఆధారపడి ఉంది. ఇందుకోసం వారు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. అబార్షన్‌ చేయకూడదని కుటుంబం నిర్ణయించుకుంది.

ఇవి కూడా చదవండి

కూతురు పుట్టిన తర్వాత ఇక భర్త నోట మాట రాక మూగబోయాడు.. చెప్పేదేమీ లేదంటూ వాపోయాడు.. ఇప్పుడు ఏం చేయాలనే ఆలోచన కూడా తనకు లేదన్నాడు. తదుపరి జీవితం ఎలా ఉంటుందో కూడా నాకు తెలియడం లేదన్నాడు.. అంతా స్తంభించిపోయినట్టుంది. యాక్సిడెంట్‌ సమయంలో నేను ఆమెతో ఉన్నానని, అయితే, ఆమె ఒంటరిగా బాధపడాల్సి వచ్చిందని అతడు కన్నీళ్లు చెప్పాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి