‘ ఛపాక్ ‘ ప్రమోషన్ కోసమేనా ” వారెవా ! దీపికా !

జెఎన్ యు విద్యార్థులకు సంఘీభావంగా ఈ నెల 7 న ఆ యూనివర్సిటీకి వెళ్లి వారికి సంఘీభావం ప్రకటించింది బాలీవుడ్ నటి దీపికా పదుకోన్. అయితే ఇందులోని మతలబు ఏమిటో సినీ విశ్లేషకులు ఇట్టే పసిగట్టేశారు.  యాసిడ్ దాడి బాధితురాలి పాత్రలో తాను నటించిన ‘ ఛపాక్ ‘ చిత్రం ప్రమోషన్ కోసమే ఆమె ఇలా సరికొత్త ‘ మద్దతు ‘ అస్త్రం ప్రయోగించిందన్నది వారి అంచనా. ఈ సినిమా ఈ నెల 10 న విడుదల […]

' ఛపాక్ ' ప్రమోషన్ కోసమేనా  వారెవా ! దీపికా !
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 09, 2020 | 11:49 AM

జెఎన్ యు విద్యార్థులకు సంఘీభావంగా ఈ నెల 7 న ఆ యూనివర్సిటీకి వెళ్లి వారికి సంఘీభావం ప్రకటించింది బాలీవుడ్ నటి దీపికా పదుకోన్. అయితే ఇందులోని మతలబు ఏమిటో సినీ విశ్లేషకులు ఇట్టే పసిగట్టేశారు.  యాసిడ్ దాడి బాధితురాలి పాత్రలో తాను నటించిన ‘ ఛపాక్ ‘ చిత్రం ప్రమోషన్ కోసమే ఆమె ఇలా సరికొత్త ‘ మద్దతు ‘ అస్త్రం ప్రయోగించిందన్నది వారి అంచనా. ఈ సినిమా ఈ నెల 10 న విడుదల కానుంది.  సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ఇటీవల ఢిల్లీలో గజగజ వణికించే చలిలో అర్దరాత్రి తమ పసిపిల్లలతో సహా అనేకమంది మహిళలు నిరసన తెలిపినప్పుడు గానీ, ఈ మధ్యే జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడి, బాష్పవాయువు ప్రయోగించినప్పుడు గానీ దీపిక జాడే కనబడలేదన్నది వీరి వాదన. అలాగే దేశంలో అనేకచోట్ల సామూహిక అత్యాచారాలు, లించింగ్ లు జరుగుతున్నా ఈమె స్పందన ఎక్కడ అన్నది వీరి ప్రశ్న. అలాంటిది  హఠాత్తుగా దీపికకు ఈ విద్యార్థులు గుర్తుకు రావడం తన తాజా మూవీ ప్రమోషన్ కోసమే అని వీళ్ళు తేల్చేశారు. అటు బీజేపీ నేతలు దీపిక చర్యతో ఆగ్రహించి ఆమె నటించిన సినిమాలను బహిష్కరించాలని ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. తాను ‘ సంఘ సంస్కర్త’ ను కానని, ప్రధాన అంశాలపై అదేపనిగా స్పందించడం తన నైజం కాదని ఈ బాలీవుడ్ నటి అనేక సందర్భాల్లో తనిచ్చిన ఇంటర్వ్యూలలో చెప్పుకున్నారు. అయితే తాప్సీ పొన్ను, స్వర భాస్కర వంటి నటీమణులు తాము నటించిన సినిమాలు విడుదలకు దరిదాపుల్లో లేకున్నా ఎన్నోసార్లు వివిధ సామాజికాంశాలపై తమ అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడించారు. ఈ మధ్యే సీఏఏ కు వ్యతిరేకంగా ఈ ఇద్దరు తారలూ తీవ్రంగా స్పందించారు. ఇతర బాలీవుడ్ సెలబ్రిటీలతో కలిసి ముంబైలో ఈ నెల 5 న జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు కూడా.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?