పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..కారణం అదే..!

పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. డీజిల్‌పై 17 పైసలు, పెట్రోల్‌పై 7 పైసల పెరుగుదల కనిపిస్తోంది. ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఈ ప్రభావంతో ఒక్కసారిగా ముడిచమురు ధరలు భగ్గుమన్నాయి. యుద్ద వాతావరణం ఉన్న నేపథ్యంలో  పశ్చిమాశియా దేశాల్లో చమురు సరఫరా ఆగిపోయే ప్రమాదం కూడా ధరల పెరుగుదలకు ఓ కారణం. తాజాగా హైదరాబాద్‌‌లో లీటర్ పెట్రోల్ రూ. 80. 61 కాగా, డీజిల్ ధర రూ. 75.17కు చేరుకుంది. […]

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..కారణం అదే..!
Follow us

|

Updated on: Jan 09, 2020 | 10:18 AM

పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. డీజిల్‌పై 17 పైసలు, పెట్రోల్‌పై 7 పైసల పెరుగుదల కనిపిస్తోంది. ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఈ ప్రభావంతో ఒక్కసారిగా ముడిచమురు ధరలు భగ్గుమన్నాయి. యుద్ద వాతావరణం ఉన్న నేపథ్యంలో  పశ్చిమాశియా దేశాల్లో చమురు సరఫరా ఆగిపోయే ప్రమాదం కూడా ధరల పెరుగుదలకు ఓ కారణం.

తాజాగా హైదరాబాద్‌‌లో లీటర్ పెట్రోల్ రూ. 80. 61 కాగా, డీజిల్ ధర రూ. 75.17కు చేరుకుంది. ఇక ఏపీ రాజధాని అమరావతిలో కూాడా ధరల పెరుగదల అనంతరం పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 80.14, రూ. 74.34లకు ఎగబాకాయి. అమరావతికి, విజయవాడకు కూడా ధరల్లో వ్యత్యాసం ఉంది. బెజవాడలో  పెట్రోల్ ధర 7 పైసలు పెరగడంతో  రూ .79.77కు,  డీజిల్ ధర 15 పైసలు పెరుగుదలతో రూ. 74.00కు చేరుకున్నాయి. ఇండియా చమురును చేసుకునే పశ్చిమాశియా దేశాలలోకెల్లా ఇరాన్ ప్రధాన భూమిక పోషిస్తుంది. అంతర్జాతీయంగా ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులే కొనసాగితే చమురుతో పాటు ఎల్‌పీ గ్యాస్ ధరలు కూడా విపరీతంగా పెరిగే ప్రమాదం ఉంది. దీంతో భారతదేశంలోని సామాన్యుల జేబులపై భారీ భారం పడనుంది. ఇక రూపాయి విలువ కూడా తీవ్రంగా దిగజారే పరిస్థితులే కనిపిస్తున్నాయి. కాగా జనవరి 2 నుండి యావరేజ్‌గా పెట్రోల్ ధర లీటరుకు 53 పైసలు పెరగగా, డీజిల్ రేట్లు 72 పైసలు పెరిగాయి.