తమిళనాడులో దారుణం.. విధుల్లో ఉన్న పోలీస్‌పై కాల్పులు
తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న పోలీస్‌పై దుండగులు కాల్పులు జరిపారు. కేరళ-తమిళనాడు సరిహద్దుల్లో కలియక్కవిలై చెక్‌పోస్ట్ వద్ద విధుల్లో ఉన్న ఇన్‌స్పెక్టర్‌పై దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వాహనాలు తనిఖీలు చేస్తుండగా.. ఇన్‌స్పెక్టర్ విల్సన్‌పై తుపాకీలతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో విల్సన్ తీవ్రంగా గాయపడగా.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ ఆయన కన్నుమూశారు. రాత్రి 10గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. తిరువనంతపురం నుంచి వస్తోన్న […]
తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న పోలీస్‌పై దుండగులు కాల్పులు జరిపారు. కేరళ-తమిళనాడు సరిహద్దుల్లో కలియక్కవిలై చెక్‌పోస్ట్ వద్ద విధుల్లో ఉన్న ఇన్‌స్పెక్టర్‌పై దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వాహనాలు తనిఖీలు చేస్తుండగా.. ఇన్‌స్పెక్టర్ విల్సన్‌పై తుపాకీలతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో విల్సన్ తీవ్రంగా గాయపడగా.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ ఆయన కన్నుమూశారు. రాత్రి 10గంటల సమయంలో ఈ దారుణం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. తిరువనంతపురం నుంచి వస్తోన్న TN-57-AW-1559 మహీంద్రీ స్కార్పియో వాహనాన్ని విల్సన్‌తో పాటు మరికొందరు పోలీసులు ఆపేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అందులో నుంచి దిగిన ఓ వ్యక్తి విల్సన్‌పై మూడు సార్లు కాల్పులు జరిపాడు. అందులో ఓ బుల్లెట్ ఆయన ఛాతీలో దిగబడింది. ఆ తరువాత వారు కేరళ సరిహద్దు వైపు వారు దూసుకెళ్లారు. సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. కాగా ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఓ యాక్సిడెంట్‌లో గాయపడ్డ విల్సన్ రెండు నెలలు విశ్రాంతి తీసుకొని ఇటీవల తన డ్యూటీలో మళ్లీ జాయిన్ అయ్యారు. మరో ఐదు నెలల్లో ఆయన రిటైర్‌మెంట్ ఉండగా.. ఈ లోపే దుండగుల చేతిలో ఆయన మరణించారు.