AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫిబ్రవరి 1 న బడ్జెట్.. మోదీ ప్రభుత్వం ముందు పెను సవాళ్లు

ప్రధానిగా మోదీ రెండోసారి మళ్ళీ పగ్గాలు చేపట్టాక.. మొదటిసారిగా పూర్తి స్థాయి బడ్జెట్ ను కేంద్రం ఫిబ్రవరి 1 న పార్లమెంటుకు సమర్పించనుంది. దేశ ఎకానమీ అనేక ఎగుడుదిగుడులకు లోనవుతూ.. దేశంలో వేలాది యువజనులు ఉద్యోగాలకోసం కళ్ళలో వత్తులు వేసుకుని చూస్తున్న వేళ.. వివిధ రంగాలు బలహీనంగా తమను ‘ ఆదుకునే వారి కోసం ‘ ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో. జీడీపీ వృద్ది రేటు క్షీణిస్తున్న ఈ సమయంలో మోదీ ప్రభుత్వం వివిధ ‘ సాహసోపేత ‘ […]

ఫిబ్రవరి 1 న బడ్జెట్.. మోదీ ప్రభుత్వం ముందు పెను సవాళ్లు
Umakanth Rao
| Edited By: |

Updated on: Jan 09, 2020 | 12:37 PM

Share

ప్రధానిగా మోదీ రెండోసారి మళ్ళీ పగ్గాలు చేపట్టాక.. మొదటిసారిగా పూర్తి స్థాయి బడ్జెట్ ను కేంద్రం ఫిబ్రవరి 1 న పార్లమెంటుకు సమర్పించనుంది. దేశ ఎకానమీ అనేక ఎగుడుదిగుడులకు లోనవుతూ.. దేశంలో వేలాది యువజనులు ఉద్యోగాలకోసం కళ్ళలో వత్తులు వేసుకుని చూస్తున్న వేళ.. వివిధ రంగాలు బలహీనంగా తమను ‘ ఆదుకునే వారి కోసం ‘ ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో. జీడీపీ వృద్ది రేటు క్షీణిస్తున్న ఈ సమయంలో మోదీ ప్రభుత్వం వివిధ ‘ సాహసోపేత ‘ నిర్ణయాలను ఈ  కొత్త బడ్జెట్లో తీసుకోవచ్చునని ఆర్ధిక నిపుణులు భావిస్తున్నారు. ఇటీవలే రిజర్వ్ బ్యాంకు తీసుకున్న కొన్ని చర్యలు ఆర్థిక వృద్దికి దోహదపడేవిగా ఉన్నప్పటికీ అవి చాలవన్నది వారి భావన. 2024 సంవత్సరం కల్లా 5 ట్రిలియన్ డాలర్ల వృద్దితో ‘ మేకిన్ ఇండియా ‘ అన్న స్లోగన్ ని మోదీ సర్కార్ తన లక్ష్యంగా పెట్టుకుంది.  ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం జీడీపీలో ప్రభుత్వ బడ్జెట్ లోటు 3. 8 శాతంగా ఉందని అంచనా. ఇది 3.3 శాతం టార్గెట్ ని మించే ఉందని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నట్టు రాయిటర్ వార్తా సంస్థ వెల్లడించింది. సెప్టెంబరు 30తో అంతమైన త్రైమాసికానికి భారత జీడీపీ రేటు ఆరేళ్ళ కనిష్ట స్థాయికి-4.5 శాతానికి తగ్గిపోయింది. వినియోగదారుల కొనుగోలు శక్తి తగ్గడం, పూర్ డిమాండ్ వంటి వివిధ కారణాలవల్ల ఆర్ధిక సంస్థలు తమ గ్రోత్ ప్రొజెక్షన్స్ ని తగ్గించుకున్నాయి. కార్పొరేట్ పన్నుల్లో కోత లాంటి పలు చర్యలను ప్రభుత్వం ఇటీవల చేబట్టింది. . అలాగే ఆర్ధిక వృద్ది రేటుకు అనుగుణంగా రూ. 102 లక్షల కోట్ల ప్రాజెక్టును ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఏమైనా.. ఈ సంవత్సరం మార్చి మాసాంతానికి జీడీపీ రేటు 5 శాతానికి పెరగవచ్చునన్నది ప్రభుత్వ అంచనా. ఇదే జరిగితే.. 11 ఏళ్లలో వృద్ది రేటు ఇంత మెల్లగా పెరగడం ఇదే మొదటిసారి కావచ్ఛు. ఇలా ఉండగా ‘ బడ్జెట్-2020 ‘ నేపథ్యంలో.. ప్రధాని మోదీ గురువారం ఆర్ధిక రంగ నిపుణులతో సమావేశమై తదనంతర నిర్ణయాలపై సమీక్షించనున్నారు.

Follow Us
తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి 2026 ఫలితాల తేదీలు చూశారా?
తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి 2026 ఫలితాల తేదీలు చూశారా?
షాకింగ్‌ న్యూస్‌.. పెరగనున్న మందుల ధరలు.. ఏయే టాబ్లెట్స్‌ అంటే..!
షాకింగ్‌ న్యూస్‌.. పెరగనున్న మందుల ధరలు.. ఏయే టాబ్లెట్స్‌ అంటే..!
Shukra Gochar: ఈ రాశులకు చెందిన మహిళలకు లక్ష్మీ కటాక్షం..!
Shukra Gochar: ఈ రాశులకు చెందిన మహిళలకు లక్ష్మీ కటాక్షం..!
బయటకెళ్దామని బండి తీశాడు.. తాళం ఆన్ చేస్తుండగా కనిపించింది చూసి..
బయటకెళ్దామని బండి తీశాడు.. తాళం ఆన్ చేస్తుండగా కనిపించింది చూసి..
సింగిల్‌గానే ఫుల్ హ్యాపీ అంటున్న హన్సిక..
సింగిల్‌గానే ఫుల్ హ్యాపీ అంటున్న హన్సిక..
అనాథాశ్రమంలో పెరిగింది.. రెండేళ్లు పానీపూరితో ఆకలి తీర్చుకుంది
అనాథాశ్రమంలో పెరిగింది.. రెండేళ్లు పానీపూరితో ఆకలి తీర్చుకుంది
బంగారం వేసుకుంటే ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం ఖాయం
బంగారం వేసుకుంటే ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం ఖాయం
హైదరాబాద్‌లో ఇల్లు కొంటున్నారా.? ఇవి తెలియకపోతే మీ జేబుకు చిల్లే
హైదరాబాద్‌లో ఇల్లు కొంటున్నారా.? ఇవి తెలియకపోతే మీ జేబుకు చిల్లే
ఒంటిపై 250 టాటూలు..భర్త వికృత చేష్టలకు బలైపోయిన మహిళ కథ!
ఒంటిపై 250 టాటూలు..భర్త వికృత చేష్టలకు బలైపోయిన మహిళ కథ!
కవలల అద్భుతం.. ఇంటర్‌లో ఒకే మార్కులు సాధించి సంచలనం
కవలల అద్భుతం.. ఇంటర్‌లో ఒకే మార్కులు సాధించి సంచలనం