తమిళ్ ఇండస్ట్రీ పై ఫోకస్ పెడుతున్న నిధి అగర్వాల్.? 

Rajeev 

12 May  2026

instagram

ప్రస్తుతం నిధి అగర్వాల్ పేరు సోషల్ మీడియా తెగ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సరైన హిట్టు కోసం వెయిట్ చేస్తూనే వరుస అవకాశాలు అందుకుంటుంది.

చివరిగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాజా సాబ్ చిత్రంలో మెరిసింది నిధి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా నిరాశపరిచింది. 

బాలీవుడ్ నుంచి ఇండస్ట్రీకి వచ్చినీ ముద్దుగుమ్మ తెలుగులో అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. వరుసగా సినిమాలు చేసిన లాభం లేకుండాపోయింది. 

వరుసగా యంగ్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకున్నప్పటికీ అనుకున్నంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.

ఇప్పటివరకు నిధి అగర్వాల్ నటించిన సినిమాల్లో ఇస్మార్ట్ శంకర్ తప్ప మిగిలిన సినిమాలేవీ పెద్దగా హిట్ అవ్వలేదు. 

పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు, ప్రభాస్ రాజా సాబ్ సినిమాలు కూడా ఈ అమ్మడిని గట్టెక్కించలేకపోయాయి. 

దాంతో ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీ పై ఫోకస్ పెడుతుందట నిధి అగర్వాల్. ఇప్పటికే అక్కడ ఓ సినిమా చేసింది. ఇప్పుడు మరిన్ని ఛాన్స్ లు అందుకోవాలనుకుంటుందని టాక్.