అనుష్క శెట్టి కెరీర్‌లో 5 అట్టర్ ఫ్లాప్ సినిమాలు.. వీటి వెళ్లకుండా ఉండాల్సింది

12 May 2026

Pic credit - Instagram

Phani Ch

గ్లామర్ డాల్‌గా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత లేడీ సూపర్ స్టార్‌గా ఎదిగారు అనుష్క శెట్టి. అరుంధతి, బాహుబలి వంటి చిత్రాలతో ఆమె పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు.

అనుష్క సినీ ప్రయాణంలో కూడా ఆమెను, అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన కొన్ని అట్టర్ ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి.

మంచు విష్ణు హీరోగా వచ్చిన 'అస్త్రం' సినిమాతో అనుష్క కెరీర్ మొదట్లో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.  ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది.

అనుష్క కెరీర్‌లో అత్యంత ఘోరమైన పరాజయం ఏదంటే అందరూ 'ఒక్క మగాడు' అనే చెబుతారు. ఈ సినిమాలో ఎందుకు నటించానా అని అనుష్క స్వయంగా ఒక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం.

మాస్ మహారాజ్ రవితేజతో అనుష్క నటించిన 'బలాదూర్' కూడా ఫ్లాప్ లిస్టులో ఒకటి. వీరిద్దరి కాంబినేషన్ అంటే కనీసం వినోదం ఉంటుందని ఆశించిన ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది.

చంద్రముఖి వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన సీక్వెల్ 'నాగవల్లి'. ఇందులో వెంకటేష్ సరసన అనుష్క నటించింది. ఈ చిత్రం అనుష్క ఖాతాలో మరో పరాజయంగా మిగిలిపోయింది.

అనుష్కను శారీరకంగా, మానసికగా బాగా ఇబ్బంది పెట్టిన సినిమా 'సైజు జీరో'. కంటెంట్ వీక్ గా ఉండటంతో ప్రేక్షకులు ఈ ప్రయోగాత్మక చిత్రాన్ని ఏమాత్రం ఆదరించలేదు.