వరల్డ్ డిజాస్టర్ మూవీ.. 1400 కోట్లు గోవిందా !

12 May 2026

Pic credit - Instagram

Phani Ch

ఒక సినిమా పోతే నిర్మాతలకు నష్టాలు రావడం సహజం. కానీ, ఏకంగా 1400 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తీసిన సినిమా, కనీసం పెట్టిన పెట్టుబడిలో ఒక శాతం కూడా వెనక్కి తీసుకురాలేకపోతే అది మామూలు షాక్ కాదు.

నిజానికి ఈ సినిమా షూటింగ్ 2021 సెప్టెంబర్‌లోనే నియోమ్ మరియు తబుక్ నగరాల్లోని ఎడారి ప్రాంతాల్లో మొదలైంది. అప్పట్లో ఇదొక విజువల్ ఫీస్ట్ అవుతుందని అందరూ భావించారు.

కానీ 'డెజర్ట్ వారియర్' అనే చిత్రం ఇప్పుడు ప్రపంచ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ బాక్సాఫీస్ డిజాస్టర్‌గా రికార్డు సృష్టించింది.

సౌదీ అరేబియా సినిమా రంగాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టాలనే ఉద్దేశంతో ఎంబీసీ (MBC) గ్రూప్ ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.

ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ హీరో, మార్వెల్ 'కెప్టెన్ అమెరికా' ఫేమ్ ఆంథోనీ మాకీ ప్రధాన పాత్ర పోషించారు. ఆయనతో పాటు ఆస్కార్ అవార్డు గ్రహీత బెన్ కింగ్స్లీ, షార్ల్టో కోప్లీ వంటి దిగ్గజ నటులు నటించడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

కానీ, అనుకోని కారణాల వల్ల ప్రొడక్షన్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు విపరీతంగా ఆలస్యమయ్యాయి. ఏకంగా ఐదేళ్ల పాటు ఈ సినిమా ల్యాబ్‌లోనే ఉండిపోవడంతో, ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి క్రమంగా తగ్గిపోయిందని విశ్లేషకులు చెబుతున్నారు.

అనేక వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఏప్రిల్ 24, 2026న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా కలిపినా ఈ సినిమా వసూళ్లు అక్షరాల 6 కోట్ల రూపాయలు కూడా దాటలేదు.