వేసవిలో పుదీనా తింటే చాలు.. శరీరం కూల్, ఆరోగ్యం ఫుల్!

12 May 2026

Jyothi Gadda

ఎండలు మండిపోతున్న వేళ మన శరీరానికి తక్షణ చల్లదనాన్ని ఇచ్చే పదార్థాల కోసం వెతుకుతుంటాం. అటువంటి వాటిలో పుదీనా అగ్రస్థానంలో ఉంటుంది. ఆయుర్వేదంలో దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. 

పుదీనాలో సహజంగానే చల్లబరిచే గుణం ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. ఎండలో తిరిగి వచ్చినప్పుడు పుదీనా కలిపిన పానీయాలు తాగితే తక్షణ శక్తి లభిస్తుంది.

వేసవిలో జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. పుదీనా ఆకులు తిన్నా లేదా దాని రసం తాగినా గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తొలగిపోతాయి. ఇది ఆకలిని పెంచుతుంది.

నోటి దుర్వాసన నివారణ. పుదీనా ఒక సహజమైన మౌత్ ఫ్రెషనర్‌గా పనిచేస్తుంది. నోటిలోని బ్యాక్టీరియాను చంపి, దుర్వాసనను తగ్గిస్తుంది. పంటి నొప్పుల నుండి కూడా ఇది ఉపశమనం కలిగిస్తుంది.

పుదీనాలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల వేసవిలో వచ్చే మొటిమలు, చెమటకాయలు, చర్మంపై దద్దుర్లను తగ్గిస్తుంది. పుదీనా రసాన్ని ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.

పుదీనా సువాసన ఒత్తిడిని (Stress) తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. తలనోపు ఉన్నప్పుడు పుదీనా నూనె లేదా ఆకుల రసాన్ని వాడటం వల్ల త్వరగా ఉపశమనం లభిస్తుంది.

వేసవిలో మజ్జిగలో కొన్ని పుదీనా ఆకులు, జీలకర్ర పొడి కలిపి తాగితే అమృతంలా ఉంటుంది. నిమ్మరసం (Lemonade) చేసేటప్పుడు అందులో కొన్ని పుదీనా ఆకులను చేర్చుకోవచ్చు.

పుదీనా చట్నీని అన్నం లేదా టిఫిన్లలో తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యం అందుతుంది. సౌలభ్యంగా, తక్కువ ఖర్చుతో దొరికే ఈ పచ్చని పుదీనాను వాడుతూ ఈ వేసవిని ఆరోగ్యంగా గడపండి.