Saral Pension: భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ కీలక నిర్ణయం.. ఏప్రిల్ నుంచి ‘సరళ్’ పెన్షన్ పథకం
Saral Pension: భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త వ్యక్తిగత ప్రామాణిక యాన్యుటీ బీమా పథకానికి ఆమోదం...
Saral Pension: భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త వ్యక్తిగత ప్రామాణిక యాన్యుటీ బీమా పథకానికి ఆమోదం తెలిపింది. అన్ని జీవిత బీమా సంస్థలు ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి ఈ పథకం ప్రారంభించాలని ఆదేశించింది.
ఈ పథకానికి ముందు కంపెనీ పేరు చేర్చి ‘సరళ్’ యాన్యుటీ పథకం ప్రారంభించాలని కోరింది. అయితే ఈ పథకంలో రెండు రకాల ఆప్షన్లు మాత్రమే ఉంటాయి. ఒకటి లైఫ్ యాన్యుటీ, రెండోది జాయింట్ లైఫ్ యాన్యుటీ. ఇందులో లైఫ్ యాన్యుటీ ఆప్షన్ కింద కొనుగోలు ధర పూర్తిగా చెల్లిస్తారు. జాయింట్ లైఫ్ యాన్యుటీ కింద మొదటి పాలసీదారుడు మరణం తర్వాత రెండో యాన్యుటీదారుడికి వందశాతం యాన్యుటీతో పాటు పాలసీ కొనుగోలు ధర మొత్తాన్ని చెల్లిస్తారు. కాగా, ఈ పథకం కింద మెట్యూరిటీ ప్రయోజనాలు ఉండవు. పాలసీ అమలు అయిన ఆరు నెలల్లోపు పాలసీదారుడు లేదా అతని కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా తీవ్ర అనారోగ్యం సంభవించినట్లయితే పాలసీని ఎప్పుడైనా సరెండర్ చేయవచ్చు.
Also Read: ఢిల్లీలో కనీవినీ ఎరగని రీతిలో హింస.. పోలీసులే లక్ష్యంగా దాడులు.. 83 మందికి తీవ్ర గాయాలు