ఢిల్లీలో కనీవినీ ఎరగని రీతిలో హింస.. పోలీసులే లక్ష్యంగా దాడులు.. 83 మందికి తీవ్ర గాయాలు
రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఢిల్లీలో కనీవినీ ఎరగని రీతిలో హింస చెలరేగింది… ఎర్రకోట లోపలే కాదు.. బయట కూడా పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. పోలీసులను టార్గెట్ చేస్తూ దాడులకు
delhi violence : రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఢిల్లీలో కనీవినీ ఎరగని రీతిలో హింస చెలరేగింది… ఎర్రకోట లోపలే కాదు.. బయట కూడా పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. పోలీసులను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడ్డారు ఆందోళనకారులు. నంగ్గోయి ప్రాంతంలో వరుసగా పోలీసు వాహనాలను టార్గెట్ చేశారు. ట్రాక్టర్లతో పోలీసు వాహనాలను ఢీ కొట్టారు.. ఒక్కసారి కాదు.. రెండుసార్లు కాదు.. పలుమార్లు వాహనాన్ని ట్రాక్టర్‌తో ఢీకొట్టారు.. బోల్తా పడే వరకు తమ ప్రతాపం చూపించారు.
ట్రాక్టర్ ర్యాలీ మొత్తం ట్రాక్ తప్పింది.. పోలీసులే లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారు అల్లరిమూకలు. 109 మంది పోలీసులకు గాయాలయ్యాయి. ఢిల్లీ లోని వివిధ ఆస్పత్రుల్లో పోలీసులకు చికిత్స జరుగుతోంది. పోలీసులపై దాడులతో పాటు భారీగా ఆస్తుల విధ్వంసం కూడా జరిగింది. ఢిల్లీలో హింసతో పంజాబ్ , హర్యానాలో హైఅలర్ఠ్ ప్రకటించారు. హర్యానాలో నాలుగు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఢిల్లీలో హింసపై ఇప్పటివరకు నాలుగు కేసులు నమోదయ్యాయి.
#WATCH | Delhi: Protestors attacked Police at Red Fort, earlier today. #FarmersProtest pic.twitter.com/LRut8z5KSC
— ANI (@ANI) January 26, 2021