IRCTC Offer: ఐఆర్‌సిటిసి బంపర్ ఆఫర్.. సరసమైన ధరలకే విమాన ప్రయాణం.. 4 బ్యూటీఫుల్ ప్లేసెస్ ఇవే..
IRCTC Offers: మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టమా? తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రదేశాలను చుట్టేయాలనుకుంటున్నారా?
IRCTC Offers: మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టమా? తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రదేశాలను చుట్టేయాలనుకుంటున్నారా? అయితే, మీకోసమే IRCTC అదిరిపోయే టూర్ ప్యాకేజీని ప్రకటించింది. IRCTC దేశంలోని అనేక అందమైన ప్రదేశాలకు ప్రయాణించేందుకు.. సరసమైన ధరలతో కూడిన ప్యాకేజీ ప్రకటించింది. మీకు నచ్చిన ప్యాకేజీలను ఎంచుకోవచ్చు. IRCTC బడ్జెట్ ఫ్రెండ్లీ టూర్ ప్యాకేజీ ద్వారా చాలా తక్కువ ధరలకే విమానంలో ప్రయాణించే ఛాన్స్ ఉంది. దీంతోపాటు భోజన వసతులు, బసతో పాటు అనేక సౌకర్యాలు కూడా అందిస్తోంది. IRCTC ప్రకటించిన 4 రాష్ట్రాల ప్రత్యేక టూర్ ప్యాకేజీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మహాకాళ్, ఓంకారేశ్వర్ దర్శనం మహాకాళ్ దర్శనానికి IRCTC 6 రోజుల ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీ కింద 6 రోజులు, 5 రాత్రులు టూర్ ఉంటుంది. ఇందులో మహాకాళుని దర్శనంతో పాటు ఓంకారేశ్వరుని దర్శన భాగ్యం కలుగుతుంది. దీంతో పాటు ఇండోర్, మహేశ్వర్, మాండు, ఖాండ్వా మొదలైన అన్ని ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంటుంది. You will get a chance to Visit Places స్లోగన్‌తో IRCTC ఈ ప్యాకేజీని ప్రకటించింది. కాగా, ప్రస్తుత ప్యాకేజీ పేరు ‘గ్లింప్స్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఉజ్జయిని, ఇండోర్’. ఇందుకోసం ఒక్కో పర్యాటకుడు కనీసం రూ.27,150 చెల్లించాల్సి ఉంటుంది.
గోవా టూర్.. గోవా టూర్‌కు సంబంధించి కూడా IRCTC సూపర్ ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీ పేరు ‘గోవా డిలైట్స్ ఎక్స్ రాయ్‌పూర్’. ఈ ప్యాకేజీ కింద ప్రయాణం 15 ఆగస్టు 2022న రాయ్‌పూర్ నుండి ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీలో భాగంగా గోవాలోని మంగూషి టెంపుల్, అంజునా బీచ్, బాసిలికా ఆఫ్ బోమ్ జీసస్, మిరామార్ బీచ్, మండోవి రివర్ క్రూజ్, కలాంగుట్ బీచ్, ఫోర్ట్ అగ్వాడా, వాగేటర్ బీచ్ వంటి అనేక అందమైన ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంది. ఇందుకోసం ఒక్కో వ్యక్తికి కనీసం రూ.24,660 వెచ్చించాల్సి ఉంటుంది.
కేరళ టూర్.. దక్షిణ భారతదేశంలో ప్రకృతి అందాలకు కొదవే లేదు. జర్నీలను ఇష్టపడే వ్యక్తుల లిస్ట్‌లో కేరళ పేరు ఖచ్చితంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మీరు కూడా కేరళను విజిట్ చేయాలని ప్లాన్ వేసుకుంటున్నట్లయితే.. IRCTC ప్యాకేజీని సెలక్ట్ చేసుకోవచ్చు. ఈ ప్యాకేజీ పేరు ‘కేరళ ఎయిర్ ప్యాకేజీ ఎక్స్ విశాఖపట్నం’. ఇందులో భాగంగా 5 రాత్రులు, 6 పగళ్లు ప్రయాణించే అవకాశం ఉంది. ఈ యాత్ర విశాఖపట్నం నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్యాకేజీలో మున్నార్, తిరువనంతపురం, అలప్పుజా, కొచ్చి వంటి ప్రాంతాలకు తీసుకువెళతారు. ఇందుకోసం ఒక్కో వ్యక్తికి రూ.34,910 వెచ్చించాల్సి ఉంటుంది.
లడఖ్ టూర్.. లడఖ్‌లో పర్యటించాలనుకునే వారి కోసం IRCTC సూపర్ ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీ పేరు ‘డిస్కవర్ లడఖ్’. ఇందులో భాగంగా షామ్ వ్యాలీ, లేహ్, నుబ్రా, టర్టుక్, పాంగోంగ్ మొదలైన ప్రదేశాలను సందర్శించవచ్చు. 6 రాత్రులు, 7 పగళ్లు ఉండే ఈ ప్యాకేజీకి సంబంధించిన ఎయిర్ ఫ్లైట్ ఢిల్లీ నుంచి ప్రారంభమై ఢిల్లీలోనే ముగుస్తుంది. ఇందుకోసం ఒక్కో వ్యక్తికి రూ.32,960 చెల్లించాల్సి ఉంటుంది.
ఈ విహార యాత్రలకు సంబంధించిన మరింత సమాచారం కోసం https://www.irctctourism.com/ ని సందర్శించవచ్చు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..