రక్తం గడ్డ కట్టేలా చూడటంలోనూ, కండరాలు, నాడులు సక్రమంగా పనిచేయటంలోనూ, గుండె నార్మల్‌గా కొట్టుకునేలా చేయటంలోనూ కాల్షియం పాత్ర ఉంటుందంటున్నారు నిపుణులు.
మన శరీరంలో కాల్షియం అత్యధిక శాతం ఎముకల్లోనే ఉంటుందనేది ఎవరూ కాదనలేనిది. అందుకే కాల్షియం అనగానే ఎముకలు గుర్తుకు వస్తాయి.
శరీరంలో కాల్షియం కొరవడినప్పుడు అంటే మనం తీసుకునేదానకన్నా తక్కువగా కాల్షియం తీసుకున్నప్పుడు ఎముకల నుంచి తీసుకుని భర్తీ చేసుకుంటుంది.
శరీరం తన అవసరాలకు ఎముకల నుంచి కాల్షియం తీసుకున్నప్పుడు ఎముకలు క్షీణించి పోయే ప్రమాదం ఉంటుంది. అంటే ఆస్టియోపోరోసిస్‌కు కారణం అవుతుంది.
తగినంత క్యాల్షియం తీసుకోనట్లయితే రక్తపోటు కూడా పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇది గుండె జబ్బు ముప్పుకు దారి తీయవచ్చు.
వృద్ధులు ఎముకలు క్షీణించకుండా కాల్షియం మాత్రలు వేసుకోవటం వల్ల గుండె సమస్యలు వస్తాయని అనేక అధ్యయనాలు నివేదిస్తున్నాయి.
పోషకాహారం ద్వారానే శరీరానికి తగినంత కాల్షియం లభించేలా చూసుకోవటం అన్ని విధాల ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
పాలు, పెరుగు, ఛీజ్ వంటి వాటి ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా కాల్షియం ఎక్కవగా లభిస్తుంది. బాదం, సోయా, జీడిపప్పు వంటి వాటిల్లోనూ కాల్షియం లభిస్తుంది.
కాల్షియం శరీరం సరిగా గ్రహించుకునేలా చూసే విటమిన్ డి కూడా అవసరమే అంటున్నారు నిపుణులు. రోజూ కాసేపు ఎండ తగిలేలా చూసుకుంటే చర్మమే విటమిన్ డిని తయారు చేసుకుంటుంది.