డ్యాన్స్ చేస్తే కేవలం మనసుకు ఆనందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అరగంట డ్యాన్స్ కి 10,000 అడుగులు నడిచినంత కేలరీలు ఖర్చవుతాయి.
రోజూ డ్యాన్స్ చేస్తే హార్ట్ బీట్ స్థిరంగా ఉంటుంది. వాకింగ్, ఎక్సర్‌సైజ్ కంటే డ్యాన్స్ చేసే వారి గుండె ఆరోగ్యం, శ్వాస తీసుకోవడం మెరుగుపడిందని అధ్యయనాలు చెబుతున్నాయి.
వారానికి 3 నుంచి 4 సార్లు అరగంట కంటే ఎక్కువ సేపు డ్యాన్స్ చేసే వారిలో స్టామినా, శ్వాస తీసుకునే సామర్థ్యం పెరిగినట్లు గుర్తించారు.
డ్యాన్స్ చేస్తే శరీరం ఫ్లెక్సిబుల్ అవుతుంది. దాంతో రోజూ వారీ పనులు సులభంగా చేయగలరు. అంతేకాదు జ్ఞాపకశక్తి, ప్లానింగ్, ఆర్గనైజింగ్ స్కిల్స్ మెరుగుపడతాయి.
ఒత్తిడిగా ఉన్నా, నిరుత్సాం వేధిస్తున్నా.. డ్యాన్స్ చేయడానికి ప్రయత్నించండి రిలీఫ్‌గా ఉంటుంది. డ్యాన్స్ ఒక అద్భుతమైన స్ట్రెస్ బస్టర్.
డ్యాన్ చేయడానికి ప్రత్యేకంగా నేర్చుకోవక్కర్లేదు.. మీ రూమ్‌లోనే మ్యూజిక్ పెట్టుకుని మీ బాడీని దానికి తగ్గట్టు కదిలించండి అంతే సరిపోతుంది.
డ్యాన్స్ కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో మరింత ప్రభావంతంగా పని చేస్తుందని స్టడీస్ ప్రూవ్ చేస్తున్నాయి. అందుకే డ్యాన్స్ చేయడం నేర్చుకోండి.
డ్యాన్స్ మీకు ఆనందాన్ని ఇస్తుంది. మీ మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ స్ట్రెస్ లెవల్స్ తగ్గి, బీపీ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు.