చిట్టి లవంగం.. గట్టి లాభాలు.. తింటే ఈ సమస్యలన్నీ పరార్‌!

07 January 2025

Jyothi Gadda

TV9 Telugu

లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. దీంతో ముఖ్యమైన పోషకాలూ లభిస్తాయి. కడుపులోని అల్సర్‌లను తగ్గిస్తుంది. కాలేయ ఆరోగ్యాన్ని  కాపాడతాయి. ఎముకల ఆరోగ్యానికి కూడా మంచిది.

TV9 Telugu

క్యాన్సర్ నుండి రక్షించడంలో సహాయపడతాయి. చెడు బ్యాక్టీరియాను మన దరి చేరకుండా కాపాడుతుంది. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సాయపడుతుంది.

TV9 Telugu

శీతాకాలంలో లవంగాలలో ఉండే విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులను లవంగం దూరం చేస్తుంది. 

TV9 Telugu

లవంగాల్లో యాంటీ మైక్రోబియల్, యాంటీసెప్టిక్ లక్షణాలు ఇన్ఫెక్షన్లు దరి చేర నీయవు. ఇందులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్ గుణాలు పొడిదగ్గు, కఫంతో బాధపడే వారికి చాలామంచిది. 

TV9 Telugu

కఫం సమస్య బాగా తగ్గుతుంది. ఎసిడిటీ, మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. లవంగాలు శరీరంలోని టాక్సిన్లను తొలగించి చర్మం మృదువుగా ఆరోగ్యంగా కనిపించేలా చేస్తాయి.

TV9 Telugu

కీళ్ల నొప్పులతో బాధపడేవారు రెగ్యులర్‌గా లవంగాలను వాడడం వల్ల ఉపశమనం కలుగుతుంది. లవంగాలు శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. 

TV9 Telugu

రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌ చేయడంలో లవంగం ఉపయోగపడుతుంది. ఇన్సులిన్‌ నిరోధకతను మెరుగుపరచడంతో టైప్‌ 2 డయాబెటిస్‌ తగ్గుతుంది. 

TV9 Telugu

కడుపుబ్బరం, గ్యాస్‌, మలబద్ధకం వంటి ఎన్నో రకాల జీర్ణక్రియ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో లవంగం ఉపయోగపడుతుంది. తిన్న వెంటనే ఒక లవంగం నోట్లో వేసుకుంటే మంచిది. 

TV9 Telugu