Lalu Prasad Yadav: బిహార్ ఎన్నికల వేళ లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. IRCTC కేసులో కోర్టు కీలక ఆదేశాలు..
బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీకి పెద్ద షాక్ తగిలింది. IRCTC కేసులో లాలూ కుటుంబంపై అభియోగాలు నమోదు చేయాలని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. లాలూతోపాటు రబ్రీదేవి, తేజస్విపై అభియోగాలు నమోదు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.

బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీకి పెద్ద షాక్ తగిలింది. IRCTC కేసులో లాలూ కుటుంబంపై అభియోగాలు నమోదు చేయాలని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. లాలూతోపాటు రబ్రీదేవి, తేజస్విపై అభియోగాలు నమోదు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. తనపై మోపిన ఆరోపణలన్నీ అవాస్తవమని కోర్టుకు తెలిపారు లాలూ యాదవ్.. ఇప్పటికే.. దీనిపై విచారణ చేపట్టిన సీబీఐ పలు వివరాలను వెల్లడించింది. అయితే, CBI ఆరోపణలతో ఏకీభవించిన కోర్టు అభియోగాలు నమోదు చేయాలని ఆదేశిచింది.
2004-2009 మధ్య IRCTC స్కామ్ జరిగిందని CBI ఆరోపించింది. రాంచీ, పూరీల్లోని IRCTC హోటల్స్‌ను అక్రమంగా – సుజాతా హోటల్స్‌కు లీజుకు ఇచ్చారంటూ పేర్కొనడం దుమారం చెలరేగింది. లీజుకు బదులుగా లాలూ కుటుంబానికి పాట్నాలో భూమి కేటాయించినట్టు ఆరోపణలు వచ్చాయి. లాలూ రైల్వేమంత్రిగా ఉండగా ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్ కూడా జరిగిందని కేసు నమోదయ్యింది.
ఎన్ని అక్రమ కేసులు పెట్టినా న్యాయమే గెలుస్తుంది..
అయితే అసెంబ్లీ ఎన్నికల వేళ ఇలాంటిది జరుగుతుందని ముందే ఊహించమన్నారు తేజస్వి యాదవ్. కోర్టు తీర్పును స్వాగతించారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా న్యాయమే గెలుస్తుందన్నారు. బిహార్ ప్రజలకు వాస్తవాలు తెలుసన్నారు. రైల్వేకు 90 వేల కోట్ల లాభాన్ని తెచ్చిన లాలూప్రసాద్‌పై తప్పుడు కేసు పెట్టారని మండిపడ్డారు.
ఎలాంటి బీహార్‌ను సృష్టించబోతున్నారు?
లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య, కొడుకుపై కోర్టు చేసిన ప్రకటన చాలా తీవ్రమైనదని.. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఇలాంటి వ్యక్తులు బీహార్‌ను మార్చడానికి బయలుదేరారని, కోర్టు వారిపై 420 కేసును రూపొందిస్తోందంటూ.. తేజస్విపై ఆయన ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. మీ ఇమేజ్ ఇలా ఉన్నప్పుడు మీరు ఎలాంటి బీహార్‌ను సృష్టించబోతున్నారు? అంటూ ప్రశ్నించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




