AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehul Choksi: మెహుల్ చోక్సీ ‘కిడ్నాప్’ పై ఆంటిగ్వా రాయల్ ఫోర్స్ దర్యాప్తు ప్రారంభం…..నిజమే అయితే సీరియస్ ‘మ్యాటర్’ అంటున్న ప్రధాని బ్రౌన్

వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ ని డొమినికాకు కిడ్నాప్ చేశారంటూ ఆయన తరఫు లాయర్లు దాఖలు చేసిన ఫిర్యాదుపై ఆంటిగ్వా, బర్మూడా రాయల్ ఫోర్స్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిందని ప్రధాని గెస్టన్ బ్రౌన్ వెల్లడించారు...

Mehul Choksi: మెహుల్ చోక్సీ 'కిడ్నాప్' పై ఆంటిగ్వా రాయల్ ఫోర్స్ దర్యాప్తు ప్రారంభం.....నిజమే అయితే సీరియస్ 'మ్యాటర్' అంటున్న ప్రధాని బ్రౌన్
Mehul Choksi
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Jun 07, 2021 | 10:10 AM

Share

వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ ని డొమినికాకు కిడ్నాప్ చేశారంటూ ఆయన తరఫు లాయర్లు దాఖలు చేసిన ఫిర్యాదుపై ఆంటిగ్వా, బర్మూడా రాయల్ ఫోర్స్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిందని ప్రధాని గెస్టన్ బ్రౌన్ వెల్లడించారు. ఈ కిడ్నాపింగ్ వ్యవహారం నిజమే అయితే ఇది సీరియస్ మ్యాటర్ అన్నారు. ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉందొ లాయర్లు వివరించారని, ఆ జాబితాను పోలీస్ కమిషనర్ కు అందజేశారని ఆయన చెప్పారు. తనను అపహరించుకుపోయారని చోక్సీ కూడా ఫిర్యాదు చేసినట్టు ఆయన వెల్లడించారు. పోలీసులు అన్ని అంశాలను సీరియస్ గా తీసుకుని ఇన్వెస్టిగేషన్ ప్రారంభించినట్టు పేర్కొన్నారు. కాగా చోక్సీ గత నెల 23 సాయంత్రం 5 గంటలవరకు ఆంటిగ్వా లోనే ఉన్నారని, ఇక్కడి నుంచి డొమినికా వెళ్లాలంటే 12 నుంచి 13 గంటలు పడుతుందని..కానీ నాలుగైదు గంటల్లో అక్కడికి ఎలా వెళ్తారని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు.ఆంటిగ్వా నుంచి డొమినికా 120 మైళ్ళ దూరంలో ఉందన్నారు.కాగా-ఆంటిగ్వా లోని జోలీ హార్బర్ నుంచి తమ క్లయింటును ఆంటిగ్వా, ఇండియన్ పోలీసులు బోటులో కిడ్నాప్ చేశారని చోక్సీ లాయర్లు అంటున్నారు. దీంతో కథ కొత్త మలుపు తిరిగింది.

ఇలా ఉండగా తాను చట్టానికి కట్టుబడి ఉంటానని, చట్టాన్ని గౌరవిస్తానని చోక్సీ డొమినికా హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో తెలిపారు. అమెరికాలో వైద్య చికిత్స కోసం తను ఇండియా నుంచి నిష్క్రమించానని, తనను భారతీయ అధికారులు ఎప్పుడైనా ‘ఇంటర్వ్యూ’ చేయవచ్చునని ఆయన ఇందులో పేర్కొన్నారు. ఇండియాలో నేను చట్టం బారి నుంచి తప్పించుకోలేదు అని ఆయన అన్నారు. ఇన్ని చెబుతున్న ఆయన తనను కిడ్నాప్ చేసేందుకు అవతలివారు హానీ ట్రాప్ వేసిన విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. ఈయన కిడ్నాపింగ్ వ్యవహారంలో ఓ మహిళ కీలక పాత్ర పోషించిందని వార్తలు లోగడే వచ్చాయి.

మరిన్ని ఇక్కడ చూడండి: LIC Policy: ప్రతీ నెలా రూ. 3810 డిపాజిట్ చేస్తే.. మీ కూతురు కోసం రూ. 27 లక్షలు పొందొచ్చు.. పూర్తి వివరాలు..

Anasuya Bharadwaj: భర్తతో అనసూయ లవ్‌ కెమెస్ట్రీ సూపర్‌… అభిమానులను ఆకట్టుకున్న వీడియో…