తమిళనాడు అబ్బాయి.. కేరళ అమ్మాయి.. రోడ్డుపైన ఇలా..

కేరళకు చెందిన ప్రియాంక  అనే యువతికి.. తమిళనాడుకు చెందిన రాబిన్‌సన్ అనే యువకుడితో వివాహం నిశ్చయమయ్యింది. అయితే వీరిద్దిరిది వేరువేరు రాష్ట్రాలవ్వడంతో బార్డర్‌లోనే పెళ్లి చేసుకున్నారు. 

తమిళనాడు అబ్బాయి.. కేరళ అమ్మాయి.. రోడ్డుపైన ఇలా..
Follow us

| Edited By:

Updated on: Jun 09, 2020 | 10:29 PM

గత రెండు నెలలుగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నో  పెళ్లిళ్లు నిలిచిపోయాయి. కొందరు ఆన్‌ లైన్‌లోన బంధుత్వాలు కలుపుకోగా.. మరికొందరు మాత్రం సింపుల్‌గా ఇరు కుటుంబాల సభ్యుల మధ్యే వివాహ కార్యక్రమాలను కానిచ్చేశారు. అయితే ఇవి సమీపంలోనే కుదిరిన పెళ్లిలు మాత్రమే. అయితే వధువరులు ఒకే ప్రాంతంలోని వారైతేనే ఇలా సాధ్యమైంది. అయితే వధువరులు వేరేవేరే రాష్ట్రాలకు చెందిన వారైతే వివాహ కార్యక్రమం అనేది కాస్త ఇబ్బందులతో కూడుకున్నదే. ఎందుకంటే వారికి స్టేట్ బార్డర్ దాటేందుకు అనుమతులు తప్పనిసరి. అప్పుడు పెళ్లి చేసుకోవాలంటే కాస్త ఇబ్బంది పడాల్సిందే. తమిళనాడు, కేరళకు చెందిన ఓ జంటకు ఈ ఇబ్బంది తలెత్తింది. కేరళకు చెందిన ప్రియాంక  అనే యువతికి.. తమిళనాడుకు చెందిన రాబిన్‌సన్ అనే యువకుడితో వివాహం నిశ్చయమయ్యింది. అయితే వీరిద్దిరిది వేరువేరు రాష్ట్రాలవ్వడంతో బార్డర్‌లోనే పెళ్లి చేసుకున్నారు.
రాబిన్‌సన్‌ది తమిళనాడులోని కోవై సమీపంలో నివాసం కాగా.. వధువు ప్రియాంకది ఇడుక్కి జిల్లా. వీరిది మార్చి 22న మూనారులోని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో జరగాల్సి ఉండగా.. లాక్‌డౌన్ నేపథ్యంలో వాయిదా పడింది. దీంతో గత ఆదివారం నాడు ఇదే ఆలయంలో చేసుకునేందుకు ముహుర్తం పెట్టుకున్నారు. అయితే ఇందుకు వరుడి కుటుంబం
మూనారులోని ఆలయానికి రావాల్సి ఉంది అయితే ఇది సరిహద్దు ప్రాంతం కావడం.. అందులో వరుడి కుటుంబానికి కేరళ సరిహద్దు వరకు మాత్రమే అనుమతి లభించింది. దీంతో  విషయాన్ని వధువు కుటుబానికి తెలియజేయడంతో.. వారు బార్డర్‌ సమీపంలో వచ్చి వివాహం చేసుకునేందుకు రెడీ అయ్యారు. దీంతో తమిళనాడు-కేరళ సరిహద్దుల్లోనే ఉండి.. రోడ్డుపైనే  వివాహం చేసుకున్నారు.

పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్