Indira: ఇందిరా గాంధీకి పర్ఫ్యూమ్స్‌ పంపించిన జేఆర్‌డీ టాటా.. బదులుగా ఇందిరా ఏమన్నారో తెలుసా. 1973 నాటి ఆసక్తికర లేఖ..

Indira Gandhi Letter: భారతదేశ రాజకీయాల్లో ఇందిరా గాంధీకి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో అనూహ్య నిర్ణయాలతో దేశాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించారు ఆమె...

Indira: ఇందిరా గాంధీకి పర్ఫ్యూమ్స్‌ పంపించిన జేఆర్‌డీ టాటా.. బదులుగా ఇందిరా ఏమన్నారో తెలుసా. 1973 నాటి ఆసక్తికర లేఖ..
Indira Gandhi Letter
Follow us

|

Updated on: Jul 22, 2021 | 5:48 AM

Indira Gandhi Letter: భారతదేశ రాజకీయాల్లో ఇందిరా గాంధీకి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో అనూహ్య నిర్ణయాలతో దేశాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించారు ఆమె. ఇక ధీర వనితగా పేరు తెచ్చుకున్న ఇందిరాను ప్రతిపక్ష నాయకులు పొగిడారంటే ఆమె వ్యక్తిత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. భారత దేశ చరిత్రలో మొట్టమొదటి ఏకైక మహిళా ప్రధానమంత్రిగా ఇందిరా చరిత్రల్లోకెక్కారు. ఇక ఓవైపు రాజకీయంగా ఎంత కఠినంగా ఉన్నా ప్రతిపక్షాలు, వ్యాపారవేత్తలతో ఇందిరా కలివిడిగానే ఉండేవారు. తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష గోయోంకా పోస్ట్ చేసిన ఓ లేఖ దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది.

ప్రముఖ పారిశ్రామిక వేత్త టాటా సంస్థల వ్వవస్థాపకులు జేఆర్‌డీ టాటాకు 1973 జులై 5న అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఓ లేఖ రాశారు. టాటా కంపెనీకి చెందిన పర్ఫ్యూమ్స్‌ బాటిళ్లను ఇందిరాకు బహుమతిగా అందించిన తర్వాత ఆమె బదులుగా ఈ లేఖను జేఆర్‌డీకి పంపించారు. ఇంతకీ ఈ లేఖలో ఏముందంటే.. ‘డియర్‌ జే.. మీరు పంపిన పర్ఫ్యూమ్స్‌ ఆశ్చర్యానికి గురి చేశాయి. పర్ఫ్యూమ్స్‌ను పంపినందుకు కృతజ్ఞతలు. సాధారణంగా నేను పర్ఫ్యూమ్‌లను వాడను. అలాంటి వాటికి దూరంగా ఉంటాను . కానీ మీరు పంపినందుకు ఒకసారి ట్రై చేస్తాను. మా పాలన తీరుకు సంబంధించి అభిప్రాయాలను తెలియజేయాలనుకుంటే మోహమాట పడకుండా నన్ను సంప్రదింవచ్చు. అవి అనుకూలమైనవి అయినా విమర్శనాత్మకమైనవి అయినా సరే’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ లెటర్‌ను బాంబే హౌజ్‌లో ప్రదర్శనకు ఉంచారు.

హర్ష గోయోంకా ట్వీట్‌..

Also Read: UP Professor: ఫేస్‌బుక్‌లో అభ్యంతకర వ్యాఖ్యలు..నిందితుడి వ్యవహార శైలిపై ఆగ్రహం.. జ్యుడిషియల్‌ కస్టడీకి ప్రొఫెసర్.. 

5 Paise Biryani: 5 పైసలకే వేడివేడిగా నోరూరించే బిర్యానీ.. ఎగబడ్డ జనం.. షట్టర్లు బంద్

Maruti Suzuki: గ్రామీణ ప్రాంతాల్లో మారుతీ కారు జోరు.. 50 లక్షల మార్కును దాటిన అమ్మకాలు!