AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బైక్‌ కొంటున్నారా.. అయితే ఇకపై రెండు హెల్మెట్లు కొనాల్సిందే! కేంద్ర ప్రభుత్వ కొత్త రూల్స్‌ ఇవే..

కేంద్ర ప్రభుత్వం 2026 జనవరి 1 నుండి రెండు వీలర్లపై కొత్త భద్రతా నిబంధనలు అమలు చేయనుంది. రైడర్, పిల్లియన్ ఇద్దరూ హెల్మెట్ ధరించడం తప్పనిసరి అవుతుంది. అంతేకాదు 50cc కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న కొత్త ద్విచక్ర వాహనాలలో ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) తప్పనిసరి చేయనున్నారు.

బైక్‌ కొంటున్నారా.. అయితే ఇకపై రెండు హెల్మెట్లు కొనాల్సిందే! కేంద్ర ప్రభుత్వ కొత్త రూల్స్‌ ఇవే..
Bikes
Sridhar Rao
| Edited By: SN Pasha|

Updated on: Jun 29, 2025 | 10:30 AM

Share

ఇకపై టూ వీలర్ కొనే వారు.. కచ్చితంగా రెండు హెల్మెట్లు కొనాల్సిందే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోనుంది. వాహనం నడిపేవారికి, వెనుక కూర్చున్న వారికి కూడా హెల్మెట్ తప్పనిసరి చేస్తూ మార్గదర్శకాలు జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చేందుకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కేంద్ర మోటార్ వాహనాల రూల్స్-1989 కు పలు ముఖ్యమైన మార్పులను చెయ్యాలని కేంద్రం ప్రతిపాదించింది. కొత్త సవరణ నియమాల తుది నోటిఫికేషన్ అధికారిక గెజిట్‌లో ప్రచురించిన తర్వాత మూడు నెలల్లోపు ఈ రూల్ తప్పనిసరి అవుతుందని ప్రభుత్వ నోటిఫికేషన్ పేర్కొంది.

వాహనం నడిపే వారితో పాటు వెనక కూర్చున్న వారి భద్రత కోసం కొత్త నిబంధనను కేంద్రం అమలులోకి తీసుకురానుంది. హెల్మెట్ నిబంధనతో పాటు ప్రభుత్వం మరో భద్రతా చర్యను కూడా ప్రతిపాదించింది. 2026, జనవరి 1 నుంచి 50 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం లేదా గంటకు 50 కిలోమీటర్ల వేగం దాటే మోటార్ సైకిళ్లు, స్కూటర్లు సహా అన్ని కొత్త ఎల్2 క్యాటగిరీ ద్విచక్ర వాహనాలకు యాంటీ-లాక్ బ్రేకింగ్ వ్యవస్థ(ఏబీఎస్) లను అమర్చాలని సూచనలు జారీచేసింది. వాహనానికి ఆకస్మికంగా బ్రేక్ వేసిన సమయంలో వాహనాన్ని నియంత్రించడానికి, దానితో పాటు వాహనం జారిపోయే అవకాశాలను కూడా తగ్గిస్తుంది అని నివేదికలో స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..