Abhinandan Varthaman: బాలకోట్ హీరో అభినందన్‌కు అరుదైన గౌరవం.. గ్రూప్ కెప్టెన్‌గా ప్రమోట్..
IAF Hero Abhinandan Varthaman: బాలకోట్ హీరో అభినందన్‌కు అరుదైన గౌరవం లభించింది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) లోని బాలకోట్ ఉగ్ర స్థావరాలపై
IAF Hero Abhinandan Varthaman: బాలకోట్ హీరో అభినందన్‌కు అరుదైన గౌరవం లభించింది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) లోని బాలకోట్ ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళం జరిపిన మెరుపు దాడుల్లో హీరోగా వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ హీరోగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆయన్ను గ్రూప్ కెప్టెన్ ర్యాంక్‌కు ఐఏఎఫ్ ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భారత వైమానిక దళంలోని గ్రూప్ కెప్టెన్ ర్యాంకు, ఇండియన్ ఆర్మీలో కర్నల్ ర్యాంక్‌తో సమానం. 2019 ఫిబ్రవరిలో జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్‌పై ఉగ్రవాదులు బాంబు దాడి చేశారు. ఈ ఘటనలో 43 మంది జవాన్లు అమరులు కాగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఫిబ్రవరి 27న పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని బాలాకోట్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన మెరుపు దాడులు చేసింది. ఈ క్రమంలో అభినందన్ 51 స్క్వాడ్రన్ తరపున అభినందన్ బాంబుల వర్షం కురిపించారు. మిగ్-21తో అభినందన్ పాక్ F-16ను పడగొట్టి సంచలనంగా మారారు. ఈ క్రమంలో అభినందన్ పాక్ బలగాలకు చిక్కారు.
తనపై దాడి జరిగి రక్తం కారుతున్నా అధైర్యపడకుండా.. తాను భారత వింగ్ కమాండర్‌నంటూ పేర్కొన్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించి.. అంతర్జాతీయ స్థాయిలో దౌత్యపరంగా పావులు కదిపింది. భారత్ నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక పాకిస్తాన్ అభినందన్‌ను సురక్షితంగా భారత్‌కు అప్పగించింది. అనంతరం భారత ప్రభుత్వం అభినందన్‌కు శౌర్యచక్ర అవార్డును ప్రదానం చేసింది. కాగా భారత్ జరిపిన ఏయిర్ స్ట్రైక్‌లో దాదాపు 300మంది ఉగ్రవాదులు మరణించారు.
Also Read: