Petrol Diesel Price Reduce: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ భారీ తగ్గింపు..

Petrol Diesel Price Reduce: దీపావళి పండుగ కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది.

Petrol Diesel Price Reduce: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ భారీ తగ్గింపు..
Fule Price
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 03, 2021 | 8:30 PM

Petrol Diesel Price Reduce: దీపావళి పర్వదినం వేళ వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల నుంచి వాహనదారులకు కాస్త ఉపశమనం కలిగించే న్యూస్ చెప్పింది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం వరుసగా రూ.5, రూ.10 తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకే బుధవారం నాడు కేంద్ర ఇంధన శాఖ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. తగ్గించిన ధరలు రేపటి నుంచే అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కాగా, వాహనదారులకు మరింత ఊరట కల్పించేందుకు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఎంతో కొంత ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దీపావళి పర్వదినం వేళ.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, దేశ వ్యాప్తంగా ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ చాలా చోట్ల ఘోర ఓటమిని చవి చూసింది. వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ఎఫెక్ట్ ఆ ఎన్నికలపై పడిందనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే అలర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం.. ప్రజలకు కాస్త ఊరట కల్పించేలా పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ ప్రకటించిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా.. వరుసగా పెరుగుతున్న అధిక ధరలతో సతమతం అవుతున్న ప్రజలకు.. కేంద్రం తాజాగా ప్రకటన ఊరటనిచ్చిందనే చెప్పాలి.

అయితే, ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించి ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు వినియోగదారులకు నేరుగా వర్తించదని నిపుణులు చెబుతున్నారు. ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు అనేది కంపెనీలకు లాభదాయకం అవుతుందని చెబుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం నిర్ణయం మేరకు.. కంపెనీలు రేట్లు తగ్గిస్తే ఆ ప్రయోజనం కస్టమర్లుకు అందుతుందని పేర్కొంటున్నారు.

Also read:

Petrol Diesel Price Reduce: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ భారీ తగ్గింపు..