Passport: ఆన్‌లైన్‌లో కవర్ ఆర్డర్ చేస్తే ఏకంగా పాస్‌పోర్టే వచ్చింది.. అందులోనే మరో ట్విస్ట్.. ఎంటంటే..?
Man orders passport cover online: ప్రపంచంలో జరుగుతున్న బిజినెస్‌లో.. ఎక్కువగా ఇ-కామర్స్ వెబ్‌సైట్ల నుంచే చాలామంది వస్తువులను కొనుగోలు
Man orders passport cover online: ప్రపంచంలో జరుగుతున్న బిజినెస్‌లో.. ఎక్కువగా ఇ-కామర్స్ వెబ్‌సైట్ల నుంచే చాలామంది వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. చిన్న వస్తువల నుంచి.. పెద్ద వస్తువుల వరకు అన్నీ ఈ కామర్స్ వెబ్‌సైట్లల్లోనే అందుబాటులో ఉంటాయి. అయితే.. ఇ-కామర్స్ వెబ్‌సైట్‌ల డెలివరీకి సంబంధించి మనం అనేక ఫిర్యాదులను చూస్తూనే ఉన్నాం.. ఫోన్ ఆర్డర్ చేస్తే.. రాయి రావడం, ఇంకేమైనా వస్తువులు ఆర్డర్ చేస్తే.. వాటికి బదులు మరేదో వస్తువు రావడం తరచూ చూస్తునే ఉన్నాం. దీనికి సంబంధించి ఎన్నో వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఈ కామర్స్ సైట్లు రోజులు గడిచిన కొద్ది మరింత దిగజారుతున్నాయనడనికి ఇలాంటి సంఘటనలే నిదర్శనమని పేర్కొంటారు. అయితే.. ఈసారి ఫోన్ స్థానంలో సబ్బు పెట్టెల్లాంటివి రాలేదు.. కానీ.. ఈ సారి షాకయ్యే సంఘటన వెలుగులోకి వచ్చింది. పాస్‌పోర్ట్ కవర్ ఆర్డర్ చేస్తే.. దాంతోపాటు ఒరిజినల్ పాస్‌పోర్ట్.. వినియోగదారుడి అడ్రస్‌కు చేరింది. దీనిని చూసి.. కస్టమరే నోరెళ్లబెట్టాడు. ఈ సంఘటన కేరళలో జరిగింది. కేరళకు చెందిన వ్యక్తి ఆన్‌లైన్‌లో పాస్ పోర్ట్ కవర్ కోసం ఆర్డర్ చేశాడు. అయితే.. ఈ కామర్స్ సంస్థ కవర్‌తోపాటు ఒరిజినల్ పాస్‌పోర్ట్‌ను కూడా ప్యాకింగ్ చేసి పంపింది.
వయనాడ్‌కు చెందిన మిధున్ బాబు అక్టోబర్ 30న అమెజాన్‌లో పాస్‌పోర్ట్ కవర్‌ను ఆర్డర్ చేశాడు. నవంబర్ 1న అతనికి ఆర్డర్ డెలివరీ అయింది. అయితే.. అతను ప్యాకేజ్ తెరిచి చూడగా అందులో త్రిసూర్‌లోని కున్నంకులం నివాసి అయిన ముహమ్మద్ సలీహ్ పాస్‌పోర్ట్ కూడా కనిపించింది. వెంటనే షాకైన మిధున్.. అమెజాన్ కస్టమర్ కేర్‌కు సమాచారం అందించాడు. ఈ సంఘటన గురించి విన్న వారు.. క్షమాపణలు చెప్పారు కానీ.. దానిని ఎలా తిరిగి ఇవ్వాలనే దానిపై స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని మిధున్ బాబు తెలిపాడు.
Also Read: