AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫేస్‌బుక్‌లో పరిచయం.. ప్రియుడి కోసం పాకిస్థాన్ వెళ్లిన భారతీయ యువతి

పబ్‌జీ గేమ్‌లో పరిచయైమైన యువకుడి కోసం ఇటీవల సీమా అనే మహిళ తన నలుగురు పిల్లలతో కలిసి ఇండియా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మళ్లీ అలాంటి ఘటనే చోటుచేసుకుంది.

ఫేస్‌బుక్‌లో పరిచయం.. ప్రియుడి కోసం పాకిస్థాన్ వెళ్లిన భారతీయ యువతి
Anju
Aravind B
|

Updated on: Jul 24, 2023 | 7:26 AM

Share

పబ్‌జీ గేమ్‌లో పరిచయైమైన యువకుడి కోసం ఇటీవల సీమా అనే మహిళ తన నలుగురు పిల్లలతో కలిసి ఇండియా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మళ్లీ అలాంటి ఘటనే చోటుచేసుకుంది. అయితే ఈసారి పాకిస్థాన్ నుంచి కాదు.. భారత్ నుంచే ఓ మహిళ తన ప్రియుడి కోసం పాకిస్థాన్ వెళ్లింది. వివరాల్లోకి వెళ్తే రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలోని భివాడీ ప్రాంతంలో అంజూ, అర్వింద్ దంపతులు నివసిస్తు్న్నారు. వీరికి 15 ఏళ్ల కూతురు అలాగే ఆరేళ్ల కొడుకు ఉన్నారు. అయితే అంజు(34) కు కొన్ని నెలల క్రితం ఫెస్‌బుక్‌లో పాకిస్థాన్‌కు చెందిన నస్రుల్లా అనే 29 ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది. అప్పుడప్పుడు మాట్లాడుకోవడం, చాటింగ్ చేసుకోవడంతో ఆ పరిచయం ప్రేమగా మారింది. నస్రుల్లా పాకిస్థాన్‌లో ఔషధ రంగంలో పనిచేస్తున్నాడు. అయితే అంజు ఎలాగైనా అతడ్ని కలుసుకోవాలనుకుంది.

ఇందుకోసం గురువారం వాయువ్య పాకిస్థాన్‌లోని ఖైధర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులో ఉన్న అప్పర్‌దిర్ జిల్లాకు వెళ్లింది. కానీ అక్కడి పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. అంజు మాత్రం వీసాతో పాటు కావాల్సిన పత్రాలన్ని చూపించింది. దీంతో పోలీసులు ఆమెను విడిచిపెట్టారు. ఇదిలా ఉండగా ఇటీవల పోలాండ్‌కు చెందిన ఓ మహిళకు కూడా జార్ఖండ్‌కు చెందిన యువకుడితో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో అప్పుటికే ఆరేళ్ల కుమార్తె ఉన్న పోలాండ్ మహిళ అతడ్ని పెళ్లి చేసుకునేందుకు జార్ఖండ్ వచ్చేసింది. ఈ మధ్య ఫెస్‌బుక్, ఇన్స్‌స్టాగ్రామ్, పబ్‌జీ లాంటి వాటిలో పరిచయం పెంచుకుని.. తమ ప్రియుడు లేదా ప్రియురాలి కోసం దేశాలు దాటి రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..