AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Railway: ఇకపై వెయిటింగ్ లిస్ట్‌ లేకుండా రైలు ప్రయాణం.. రైల్వేశాఖ కొత్త ప్రణాళికలు ఇవే..

భారతీయ రైల్వే దేశంలోనే అతిపెద్ద ప్రయాణ నెట్వర్క్ కలిగిన సంస్థగా మంచి గుర్తింపు ఉంది. ఎప్పుడో బ్రిటీష్ కాలం నాటి సాంకేతికతను అందిపుచ్చుకొని దినదినాభివృద్ది చెందుతోంది. ప్రయాణీకులకు ప్రజారవాణా సౌకర్యాన్ని సుఖమయం చేసేందుకు తాజాగా సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది. సాధారణంగా రైల్వే ప్రయాణంలో టికెట్ దొరికితే దానంత ఆనందం మరొకటి ఉండదు. అదే వెయిటింగ్ లిస్ట్ అంటూ చూపించిందా.. ఇక అంతే సంగతులు.

India Railway: ఇకపై వెయిటింగ్ లిస్ట్‌ లేకుండా రైలు ప్రయాణం.. రైల్వేశాఖ కొత్త ప్రణాళికలు ఇవే..
Indian Railways To Introduce 3,000 Additional Passenger Trains To End Waiting List
Srikar T
|

Updated on: Nov 18, 2023 | 9:07 AM

Share

భారతీయ రైల్వే దేశంలోనే అతిపెద్ద ప్రయాణ నెట్వర్క్ కలిగిన సంస్థగా మంచి గుర్తింపు ఉంది. ఎప్పుడో బ్రిటీష్ కాలం నాటి సాంకేతికతను అందిపుచ్చుకొని దినదినాభివృద్ది చెందుతోంది. ప్రయాణీకులకు ప్రజారవాణా సౌకర్యాన్ని సుఖమయం చేసేందుకు తాజాగా సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది. సాధారణంగా రైల్వే ప్రయాణంలో టికెట్ దొరికితే దానంత ఆనందం మరొకటి ఉండదు. అదే వెయిటింగ్ లిస్ట్ అంటూ చూపించిందా.. ఇక అంతే సంగతులు. బుకింగ్ చేసుకున్న టికెట్ డబ్బులు పోవడమే కాకుండా ప్రయాణం కొనసాగించాలంటే జనరల్ టికెట్ తప్పటి సరిగా కొనుగోలు చేయాలి.

ఇకపై రైల్లో ప్రయాణించే వారికి ఇలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు వెయిటింగ్ లిస్ట్‌లను తొలగించి కన్ఫాం చేయాలని భావిస్తోంది రైల్వే శాఖ. అందులో భాగంగా వచ్చే ఐదేళ్ల కాలంలో మరో 3000 ప్యాసింజర్ రైళ్లను ప్రస్తుత నెట్వర్క్‌కి అనుసంధానం చేయాలని యోచిస్తోంది. దీనికి ప్రదాన కారణం.. ఈ ఏడాది పండుగల సీజన్‌లో బీహార్, ఉత్తరప్రదేశ్ వైపు వెళ్లే రైళ్లలో రిజర్వేషన్ కంపార్ట్మెంట్లలో ఎక్కువగా వెయిటింగ్ లిస్ట్ ప్రయాణీకులను గుర్తించింది. వీరు కోచ్‌లో ప్రయాణించడానికి కష్టపడటంతోపాటూ, జనరల్ టికెట్లను కొనుగోలు చేసేందుకు క్యూలైన్లలో బారులు తీరారు. ఈ పరిస్థితుల దృష్ట్యా కొన్ని ప్యాసింజర్ రైళ్లను అందుబాటులోకి తేవాలని ప్రణాళికలు రచిస్తోంది.

కోవిడ్‌కి ముందు 10,186 ప్యాసింజర్ రైళ్లు ఉంటే.. ప్రస్తుతం వీటి సంఖ్యను 10,747కు పెంచినట్లు వెల్లడించింది. భవిష్యత్తులో ప్రతి రోజూ 13లక్షల మంది ప్రయాణీకులకు రిజర్వేషన్ బెర్తులు అందించాలని చూస్తోంది. దీంతో ఏడాదికి ప్రయాణికుల సంఖ్య 800 కోట్ల నుంచి 1000 కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తోంది. దీని కోసం 22 కోచ్‌లతో కూడిన ప్రత్యేక రైలును రూపొందించేందుకు సిద్దం అవుతున్నారు రైల్వే ఇంజనీర్లు. దీనిని ’22 కోచ్ ట్రైన్‌సెట్’ గా పిలుస్తారని రైల్వే టెక్నికల్ విభాగంలోని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..