Assembly Elections 2023: ప్రశాంతంగా పోలింగ్.. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో ముగిసిన ఎన్నికలు..
Madhya Pradesh, Chhattisgarh Assembly Elections 2023: మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో చెదురు ముదురు సంఘటనలు తప్ప పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మధ్యప్రదేశ్ లోని 230 అసెంబ్లీ స్థానాలకు, ఛత్తీస్‌గఢ్‌లో 70 స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం 5 గంటల వరకు మధ్యప్రదేశ్‌లో 71 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 67 శాతం పోలింగ్ నమోదైంది. ఈ రెండు రాష్ట్రాల ఫలితాలు మూడో తేదీన వెల్లడించనున్నారు. దీంతో ఆయా పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది.

230 అసెంబ్లీ స్థానాలున్నా మధ్యప్రదేశ్‌లో పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో 3 గంటలకే ముగిసింది. ఉదయం కొంత మందకొడిగా ఉన్నప్పటికీ ఆ తర్వాత ఓటర్లు పోలింగ్ బూత్‌లకు క్యూ కట్టారు. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేసింది. శివరాజ్ సింగ్, దిగ్విజయ్ సింగ్, విజయ్ రాజ్ సింథియా, నరోత్తం మిశ్రా, వీరేంద్ర కుమార్, ప్రహ్లాద్ సింగ్ వంటి ప్రముఖులు ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం శివరాజ్ సింగ్ ఓటు వేసేందుకు వెళ్లే ముందు పూజ చేశారు.
మధ్యప్రదేశ్ PCC చీఫ్ కమల్‌నాథ్ పోటీచేసిన ఛింద్వారాలో కొద్ది సేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. కమల్‌నాథ్ కొడుకు నకుల్‌నాథ్- ఒక పోలింగ్ బూత్‌లోకి వెళ్లడంతో బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అయితే తాను పోలింగ్‌బూత్‌లోకి వెళ్లలేదంటూ ఈ ఆరోపణలను నకుల్‌నాథ్ కొట్టిపారేశారు. ఇండోర్‌లో బీజేపీ అభ్యర్థి కొడుకు కాంగ్రెస్ కార్యకర్తలపై దాడికి దిగాడు. అతడి తీరుపై కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడ్డారు.
ఛత్తీస్‌గఢ్‌లో 70 స్థానాలకు..
ఛత్తీస్‌గఢ్‌లో రెండో దశలో భాగంగా 70 స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. ఉయదం 8 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరిగింది. బింద్రానావాగఢ్ లోని 9 బూత్ లలో మాత్రం మధ్యాహ్నం మూడింటికే పోలింగ్ ముగిసింది. ముఖ్యమంత్రి బఘేల్, డిప్యూటీ సీఎం సింగ్‌దేవ్ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈసారి తాము 75 స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు సీఎం భూపేష్ బఘేల్..
ఛత్తీస్‌గఢ్‌లో పోలింగ్ అనంతరం ఐటీబీపీ జవాన్ల భద్రత మధ్య సిబ్బంది తిరిగి వెళ్తుండగా బడే గోబ్రా గ్రామం పరిధిలోని గరిబండ దగ్గర నక్సలైట్టు ఐఈడీ బాంబు పేల్చడంతో ఓ జవాన్ మృతి చెందాడు. గాయపడ్డ జవాన్ జోగిందర్ సింగ్ ను హాస్పిటల్ తరలించారు.
కాగా.. ఛత్తీస్‌గఢ్‌లోని 90 స్థానాలు ఉండగా.. మొదటి విడతలో నవంబర్ 7న 20 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. మిగిలిన 70 స్థానాలకు శుక్రవారం పోలింగ్ పూర్తయింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..