Sadhguru: ‘వరల్డ్‌ కప్‌ ఎలా గెలవాలో ఆలోచించవద్దు’.. ఫైనల్‌పై సద్గురు ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..

తాజాగా జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో 'టీమ్ ఇండియా మళ్లీ వరల్డ్ కప్ గెలవడానికి ఏమైనా చిట్కాలు చెప్పాలనుకుంటున్నారా'.? అన్న ప్రశ్నకు సద్గురు బదులిస్తూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ ప్రశ్నకు బదులిస్తూ.. ట్రోఫీ గెలవాలని ప్రయత్నించవద్దని తెలిపిన సద్గురు.. భారత క్రికెట్ జట్టుకు ఆ బంతిని బాగా కొట్టడానికి చిట్కాలు ఇచ్చారు. ప్రపంచకప్ ఎలా గెలవాలో ఆలోచించవద్దని, బంతిని ఎలా కొట్టాలి...

Sadhguru: 'వరల్డ్‌ కప్‌ ఎలా గెలవాలో ఆలోచించవద్దు'.. ఫైనల్‌పై సద్గురు ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..
Sadhguru
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 17, 2023 | 5:59 PM

సద్గురు ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువుగా, ఇషా ఫౌండేషన్‌ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు. దేశావిదేశాల్లో చర్చా కార్యక్రమాల్లో పాల్గొనే సద్గురు ఎంతో మంది ఔత్సాహికుల ప్రశ్నలకు సమాధానం ఇస్తుంటారు. ప్రతీ అంశంపై తనదైన శైలిలో మాట్లాడే సద్గురు తాజాగా ప్రపంచ కప్‌పై కూడా మాట్లాడారు.

తాజాగా జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో ‘టీమ్ ఇండియా మళ్లీ వరల్డ్ కప్ గెలవడానికి ఏమైనా చిట్కాలు చెప్పాలనుకుంటున్నారా’.? అన్న ప్రశ్నకు సద్గురు బదులిస్తూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ ప్రశ్నకు బదులిస్తూ.. ట్రోఫీ గెలవాలని ప్రయత్నించవద్దని తెలిపిన సద్గురు.. భారత క్రికెట్ జట్టుకు ఆ బంతిని బాగా కొట్టడానికి చిట్కాలు ఇచ్చారు. ప్రపంచకప్ ఎలా గెలవాలో ఆలోచించవద్దని, బంతిని ఎలా కొట్టాలి, ప్రత్యర్థి జట్టు వికెట్లు ఎలా తీయాలి అనే దాని గురించి మాత్రమే ఆలోచించాలని సద్గురు సూచించారు.

సద్గురు ఇంకా మాట్లాడుతూ.. ‘ఇండియన్‌ ప్లేయర్స్‌కి క్రికెట్ ఆడటం బాగా తెలుసు. కాబట్టి నేనెందుకు దాని గురించి చెప్పాలి.? కానీ ఇప్పుడు ప్రపంచకప్ ఎలా గెలవాలని మీరు అడుగుతున్నారు. ట్రోఫీని గెలవాలని ప్రయత్నించకండి. ఆ బంతిని బాగా కొట్టండి. భారత దేశ ప్రజలంతా. ప్రపంచకప్‌ గెలవాలనే కోరికతో ఉంటే ఆటపై ఆసక్తి కోల్పోతారు. వరల్డ్‌ కప్‌ గెలవాలనే ఫాంటసీతో ఆడితే వికెట్ పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వరల్డ్‌ కప్‌ ఎలా గెలవాలని ఆలోచించకండి. బంతిని ఎలా కొట్టాలో, ప్రత్యర్థి జట్టు వికెట్లను ఎలా తీయాలో ఒక్కసారి ఆలోచించండి’ చెప్పుకొచ్చాడు.

View this post on Instagram

A post shared by Sadhguru (@sadhguru)

ఇదిలా ఉంటే సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌లో అద్భుత విజయాన్ని అందుకున్న టీమిండియా.. ఫైనల్‌కు దూసుపోయిన విషయం తెలిసిందే. ఆదివారం గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఆస్ట్రేలియాతో ఫైన్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ వీక్షించనున్నారని వార్తలు సైతం వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యావత్‌ దేశం దృష్టి ఫైనల్ మ్యాచ్‌పై పడింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..