Digital Education: డిజిటల్ విద్యపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్.. విద్యాబోధనకు 200 ఛానల్స్..
Digital Education: ఇప్పుడు ప్రపంచం అంతా టెక్నాలజీ వైపు పరుగులు పెడుతోంది. ఈ సమయంలో విద్యార్థులకు డిజిటల్ విద్యను మరింత అందుబాటులోకి
Digital Education: ఇప్పుడు ప్రపంచం అంతా టెక్నాలజీ వైపు పరుగులు పెడుతోంది. ఈ సమయంలో విద్యార్థులకు డిజిటల్ విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే వన్ క్లాస్, వన్ టీవీ ఛానెల్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే, ప్రస్తుతం ఉన్న 12 ఛానెల్స్‌ను 200కు పెంచేందుకు నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. తాజాగా బడ్జెట్ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో ఇకపై అన్ని తరగతులకు ఒకేసారి డిజిటల్ విద్యాబోధన జరగనుంది. దేశంలో ప్రస్తుతం ఒకటి నుంచి పన్నెండో తరగతి వరకు 12 ఛానెల్స్ ద్వారా డిజిటల్ తరగతులు కొనసాగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఒకట్రెండు ఛానెల్స్ ద్వారా మాత్రమే స్టూడెంట్స్‌కు విద్యా బోధన సాగుతోంది. ఈ కారణంగా విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు.
తాజాగా సెంట్రల్ గవర్నమెంట్ ఛానెల్స్ సంఖ్యను 200 వరకు పెంచుతామని చెప్పడంతో, ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ ఛానెళ్లతో ముఖ్యంగా పేద విద్యార్థులకు ఎక్కువ మేలు జరుగుతుందని భావిస్తోంది మోదీ సర్కార్. అంతేకాదు దేశంలో డిజిటల్ యూనివర్సిటీని నెలకొల్పేందుకు చర్యలు ముమ్మరం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ డిజిటల్ వర్సిటీతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. విద్యార్థుల కోసం 200 ఎడ్యుకేషనల్ టీవీ ఛానెల్‌లను ప్రారంభించనున్నట్లు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. దేశంలోనే తొలి డిజిటల్ యూనివర్సిటీని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించబోతోందని స్పష్టం చేశారాయన. దీనికి కోసం ఇప్పటికే చర్యలు ప్రారంభించినట్టు వెల్లడించారు అనురాగ్ ఠాకూర్.
Also read:
Bandi Sanjay Arrest: బండి సంజయ్ అరెస్టు వ్యవహారం.. ఢిల్లీకి చేరుకున్న తెలంగాణ పోలీసు అధికారులు..