AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Flag: రష్యా శాటిలైట్ రాకెట్‌‌పై త్రివర్ణ పతాక రెపరెపలు.. యూఎస్, యూకే, జపాన్‌ను కాదనీ భారత్‌కు గౌరవం

Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత అంతరిక్ష పరిశ్రమ కూడా గందరగోళంలో పడింది. బుధవారం నాడు రష్యా శాటిలైట్ లాంచింగ్ రాకెట్ నుంచి కొన్ని దేశాల జెండాలను తొలగించింది.

Indian Flag: రష్యా శాటిలైట్ రాకెట్‌‌పై త్రివర్ణ పతాక రెపరెపలు.. యూఎస్, యూకే, జపాన్‌ను కాదనీ భారత్‌కు గౌరవం
Indian Flag
Balaraju Goud
|

Updated on: Mar 03, 2022 | 8:35 PM

Share

Indian Flag on Russian Space Rocket: ఉక్రెయిన్‌(Ukraine)పై రష్యా(Russia) దాడి తర్వాత అంతరిక్ష పరిశ్రమ కూడా గందరగోళంలో పడింది. బుధవారం నాడు రష్యా శాటిలైట్ లాంచింగ్ రాకెట్ నుంచి కొన్ని దేశాల జెండాలను తొలగించింది. ఈ మొత్తం విషయానికి సంబంధించిన వీడియోను రష్యన్ స్పేస్ ఏజెన్సీ(Russian Space Agency) అధిపతి డిమిత్రి రోగోజిన్ షేర్ చేశారు. ఈ వీడియోను పంచుకుంటూ, “బైకోనూర్‌లోని మా బృందం కొన్ని దేశాల జెండాలు లేకుండా మా రాకెట్ మెరుగ్గా ఉంటుందని నిర్ణయించుకుంది” అని రాశారు. రాకెట్‌పై భారత జెండాను అమర్చగా, అమెరికా, జపాన్, యూకే దేశాల జెండాలను తొలగిస్తున్నట్లు వీడియోలో కనిపించింది. ఈ జెండాలు కజకిస్తాన్‌లోని బైకోనూర్‌లోని రష్యన్ లాంచ్ ప్యాడ్ నుండి రష్యన్ స్పేస్ రాకెట్ నుంచి తొలగించారు.

రోస్కోస్మోస్ అతిపెద్ద రష్యన్ అంతరిక్ష సంస్థ. భారతదేశానికి చెందిన ఇస్రో తన రాకెట్‌తో ప్రపంచం నలుమూలల నుండి ఉపగ్రహాలను ప్రయోగించినట్లే, రోస్కోస్మోస్ కూడా చేస్తుంది. రోస్కోస్మోస్ తన రాకెట్ నుండి మార్చి 4న మూడు డజన్ల OneWeb ఇంటర్నెట్ ఉపగ్రహాలను ప్రయోగించనుంది. కానీ ఇప్పుడు రష్యా ఏజెన్సీ ఇందుకు నిరాకరించింది. శుక్రవారం మార్చి 4 ప్రణాళిక ప్రకారం మూడు డజన్ల వన్‌వెబ్ ఇంటర్నెట్ ఉపగ్రహాలను ప్రయోగించబోమని తెలిపింది. ప్రత్యేకించి OneWeb కంపెనీ కొత్త డిమాండ్లను తీర్చే వరకు ఈ నిషేధం ఉంటుందని రష్యన్ అంతరిక్ష సంస్థ పేర్కొంది.

OneWeb ఇంటర్నెట్ అనేది బ్రిటీష్ ప్రభుత్వానికి పాక్షికంగా స్వంతమైన కమ్యూనికేషన్ ఉపగ్రహ సంస్థ. వన్‌వెబ్ శుక్రవారం రష్యా సోయుజ్ రాకెట్‌లో 36 ఉపగ్రహాలను ప్రయోగించాలని భావించింది. కానీ లాంచ్ జరగదని రోస్కోస్మోస్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఉపగ్రహాలను రాకెట్ ప్రయోగిస్తున్న వీడియో ఇది. ఇందులో కొన్ని దేశాల జెండాలను తొలగిస్తున్నట్లు చూపిస్తున్నారు.

వాస్తవానికి, ఉక్రెయిన్ దాడికి అమెరికా దాని మిత్రదేశాలు రష్యా ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకున్నందున రష్యా కూడా ఈ దేశాలపై కోపంగా ఉంది. రష్యా విమానాలకు అమెరికా తన గగనతలాన్ని మూసివేసింది. అమెరికా అధ్యక్షులు జో బిడెన్ ఉక్రెయిన్‌కు బిలియన్ డాలర్లు ప్రకటించారు. రష్యాలో, ఒక వైపు ఉక్రెయిన్ దాడికి వ్యతిరేకంగా నిరసన, మరోవైపు బ్యాంకు శాఖల వెలుపల పొడవైన లైన్లు ఉన్నాయి. అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ కూడా పుతిన్‌పై ఆర్థిక ఆంక్షలు విధించింది. బీమా విషయంలో బ్రిటన్ తన నిబంధనలను కఠినతరం చేసింది. రష్యా అంతరిక్ష పరిశ్రమలోని కంపెనీలకు బ్రిటన్‌లో బీమా ఉండదని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు.

Read Also….  Russia-Ukraine Conflict: ఇక చైనా వంతు.. ఆదేశమే మేయిన్ టార్గెట్.. సంచలన కామెంట్స్ చేసిన ట్రంప్..