Viral Video: స్పోర్ట్స్ బైక్‌పై రయ్యిమంటూ దూసుకెళ్తున్న ఈ వ్యక్తి ఓ రాష్ట్ర సీఎం.. ఎవరో గుర్తించారా..?

ఎప్పుడు కుర్తా, పైజామాలో కనిపించే ఆ వ్యక్తి..న్యూ లుక్‌లో కనిపించారు. డ్రెస్సింగ్‌ స్టైల్‌ మార్చి...బైక్‌ రైడ్ చేయడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఎవరా వ్యక్తి..? తెలసుకుందాం పదండి.

Viral Video: స్పోర్ట్స్ బైక్‌పై రయ్యిమంటూ దూసుకెళ్తున్న ఈ వ్యక్తి ఓ రాష్ట్ర సీఎం.. ఎవరో గుర్తించారా..?
Cm Bike Ride
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 03, 2022 | 10:02 PM

Trending News: అధికారిక వ్యవహారాల్లో ఎప్పుడు బిజీగా ఉండే చత్తీస్ఘడ్ సీఎం భూపేశ్ భగేల్(Bhupesh Baghel) కొత్త అవతారమెత్తారు. కాసేపు బిజీ వ్యవహారాలన్నీ పక్కనపెట్టి బైక్‌ రైడర్‌గా మారిపోయారు. రెడ్ జాకెట్, సన్ గ్లాసెస్, హెల్మెట్ ధరించి బైక్ రైడింగ్ చేసిన వీడియోను చత్తీస్ఘడ్(Chhattisgarh) సీఎంవో కార్యాలయం ట్విట్టర్ లో పెట్టింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అడ్వెంచ‌ర్ స్పోర్ట్స్‌ను ఎంక‌రేజ్ చేసేందుకు చ‌త్తీస్‌ఘ‌డ్ ప్రభుత్వం ఈ నెల 5,6 తేదీల్లో నేష‌న‌ల్ సూప‌ర్‌క్రాస్ బైక్ రేసింగ్ ఈవెంట్‌ను నిర్వహించ‌బోతోంది. ఈ ఈవెంట్ ను ప్రమోట్ చేసేందుకు ఏకంగా సీఎం భూపేశ్ భగేల్ బైక్ రైడర్ గా మారారు. ఒంటరిగా బైక్‌ వెళ్తూ కనిపించిన వీడియో కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తోంది. చత్తీస్ఘడ్ సీఎం భూపేశ్ భగల్ డ్రెస్సింగ్‌ స్టైల్లే వేరు. ఎక్కువగా ఆయన కుర్తా, పైజామాలో కనిపిస్తారు. అయితే వీటన్నింటిని పక్కనపెట్టేశారు భూపేశ్‌ భగల్‌. రాజధాని రాయ్‌పూర్‌లో సీఎం భగేల్‌ న్యూ లుక్‌లో కనిపించడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఆయన జీన్స్ టీ-షర్ట్, కూలింగ్ గ్లాస్, బైకింగ్ జాకెట్ ధరించి.. స్పోర్ట్స్ బైక్ నడిపారు. బాలీవుడ్‌ హీరోను తలపించిన భగేల్‌ బైక్‌ రైడింగ్‌ సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. సీఎం భూపేష్‌ రియల్‌ హీరో అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

Also Read: AP: శివుని చెంత జాగారంలో జనం.. ఊర్లో నుంచి శబ్ధాలు.. పరుగు పరుగున వెళ్లి చూడగా..

Telangana: కానిస్టేబుల్ గారూ..! మీరే ఇలా చేస్తే ఎలా..? ఇప్పుడు తలదించుకుంటే సరిపోద్దా..?