Indian – Chinese: సరిహద్దులో మరోసారి రెచ్చిపోయిన చైనా.. బుద్ధి చెప్పిన భారత ఆర్మీ..

సరిహద్దు దేశాలతో డ్రాగన్ కంట్రీ గిచ్చి కయ్యాలు పెట్టుకుంటోంది. సరిహద్దులో మరోసారి రెచ్చిపోయింది డ్రాగన్‌ ఆర్మీ. అంతర్జాతీయంగా ఎన్ని దేశాలు తప్పుబట్టినా తన తీరు మార్చుకోవడంలేదు చైనా.

Indian - Chinese: సరిహద్దులో మరోసారి రెచ్చిపోయిన చైనా.. బుద్ధి చెప్పిన భారత ఆర్మీ..
Chinese Soldiers
Follow us

|

Updated on: Oct 08, 2021 | 1:50 PM

సరిహద్దు దేశాలతో డ్రాగన్ కంట్రీ గిచ్చి కయ్యాలు పెట్టుకుంటోంది. సరిహద్దులో మరోసారి రెచ్చిపోయింది డ్రాగన్‌ ఆర్మీ. అంతర్జాతీయంగా ఎన్ని దేశాలు తప్పుబట్టినా తన తీరు మార్చుకోవడంలేదు చైనా. సరిహద్దు దేశాలతో సయోధ్యగా ఉండాల్సింది పోయి.. కవ్వింపు చర్యలకు దిగుతోంది డ్రాగన్ దేశం. అరుణాచల్‌ సెక్టార్‌లో భారత్‌లోకి చొరబడేందుకు యత్నించింది. తవాంగ్‌లోకి చొచ్చుకొచ్చిన 2వందల మంది చైనా జవాన్లు.. భారత బంకర్లను ధ్వంసం చేసేందుకు యత్నించారు. అయితే వెంటనే అప్రమత్తమైన భారత జవాన్లు.. వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కొద్ది గంటల పాటు ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంది.  అయితే ఉన్నతాధికారుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగినట్టు తెలుస్తోంది.

ఇక ఇటీవల నందా దేవి బయోస్పియర్ రిజర్వ్‌కు సమీపోలోని బారాహోటి ప్రాంతం నుంచి మనదేశంలోకి చొరబడేందుకు యత్నించారు. దాదాపు వంద మంది సైనికులు నిబంధనలు అతిక్రమించి మన దేశంలోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించారు. తూర్పు లడఖ్‌లో ఇరు దేశాల కోట్లాది మంది సైనికులు ఘర్షణలో ఉన్న మరో వివాదానికి పరిష్కారం కోసం భారత్ మరియు చైనా చర్చలు జరుపుతున్నాయి.

చైనా సరిహద్దుల్లోని బుమ్లా, యాంగ్తే కనుమల మధ్య ఈ చొరబాటు ప్రయత్నం జరిగినట్లు సమాచారం. అయితే చైనా సైనికుల్ని తాత్కాలికంగా మాత్రమే అదుపులోకి తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే చైనా వైపు నుంచి భారత సైన్యానికి కవ్వింపులు రోజు రోజుకు పెరుగుతోంది. అలాగే సరిహద్దుల్లో త్వరలో రాబోయే శీతాకాలం దృష్యా ప్రతికూల వాతావరణ పరిస్దితుల్లో చొరబాట్లకు ఎక్కువగా ఛాన్స్ కూడా ఉంటుంది. దీంతో చైనా బలగాలు ఇప్పటి నుంచే ఆ ఏర్పాట్లలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులపై కన్నేసినట్లు అర్ధమవుతోంది. ఇరువర్గాలు తమ అవగాహన మేరకు పెట్రోలింగ్ కార్యకలాపాలను చేపడతాయని చెప్పారు. కొన్నిసార్లు రెండు పెట్రోలింగ్‌లు ముఖాముఖికి వస్తాయి.

ఇవి కూడా చదవండి: Tomato Price: బాబోయ్ కిలో టమాటా ధర ఇంతా.. రైతుల దగ్గర నుంచి రైతు బజార్‌ల వరకు ధరలకు మళ్లీ రెక్కలు

IPL 2021 RCB vs DC Live Streaming: బెంగళూరు వర్సెస్ ముంబై.. ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా మ్యాచ్‌లు చూడాలో తెలుసా..

Tea History: నిద్రమత్తును వదిలించే చాయ్.. మొదట్లో ఎందుకోసం తయారు చేసేవారో తెలిస్తే షాక్ అవుతారు..

Dosa War: దేశాన్ని రెండుగా విడగొట్టిన దోస.. మాడిపోయిన దోసపై నెట్టింట్లో రచ్చ రచ్చ.. ఏం జరిగిదంటే..