దేశానికి ఇక ఆయన పేరు పెట్టేస్తారేమో , బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎద్దేవా

ఏదో ఒక రోజున ఇండియాకు ప్రధాని మోదీ పేరు పెట్టేస్తారేమోనని బెంగాల్ సీఎం, టీఎంసీ నేత మమతా బెనర్జీ  ఎద్దేవా చేశారు. ప్రధాని తనను తాను గొప్పలు చెప్పుకుంటున్న నాయకుడవుతున్నారని...

  • Umakanth Rao
  • Publish Date - 6:31 pm, Mon, 8 March 21
దేశానికి ఇక ఆయన పేరు పెట్టేస్తారేమో , బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎద్దేవా

ఏదో ఒక రోజున ఇండియాకు ప్రధాని మోదీ పేరు పెట్టేస్తారేమోనని బెంగాల్ సీఎం, టీఎంసీ నేత మమతా బెనర్జీ  ఎద్దేవా చేశారు. ప్రధాని తనను తాను గొప్పలు చెప్పుకుంటున్న నాయకుడవుతున్నారని, కరోనా వైరస్ వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై తన ఫోటోలను ప్రచురింపజేసుకోవడం,  సర్దార్ వల్లభ భాయ్ పటేల్ స్టేడియం కి తన పేరు పెట్టుకోవడం ..ఇలా అన్నింటా తన పేరును హైలైట్ చేసుకుంటున్నారని ఆమె ఆరోపించారు. చివరకు ఇస్రో అంతరిక్షంలోకి తన ఫోటోలు పంపేలా చూసుకుంటున్నారని ఆమె అన్నారు.  ఈ దేశానికి మోదీ పేరు పెట్టే రోజులు దగ్గరలోనే ఉందని సెటైరికల్ గా వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం కోల్ కతాలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న మమత… నిన్న మోదీ.. బ్రిగేడ్  పరేడ్ గ్రౌండ్ ని ‘బీ-గ్రేడ్ ‘ గ్రౌండ్ గా మార్చేశారని వ్యంగ్యంగా పేర్కొన్నారు. (ఆదివారం నగరంలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగించారు). ఎన్నికలప్పుడు మాత్రమే బీజేపీ నేతలు ఈ రాష్ట్రానికి వస్తుంటారని, అబధ్ధాలు, కట్టుకథలు చెబుతుంటారని మమత ఆరోపించారు. మహిళల భద్రత గురించి వారు ప్రస్తావిస్తున్నారని, అయితే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళల రక్షణ గురించి నోరెత్తరని ఆమె అన్నారు.

దేశంలో మోడల్ రాష్ట్రంగా చెప్పుకుంటున్న గుజరాత్ పై ప్రధాని, హోం మంత్రి దృష్టి పెట్టాలని, ఆ రాష్ట్రంలో గత రెండేళ్లలో రోజుకు నాలుగు అత్యాచారాలు, రెండు హత్యలు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. బెంగాల్ ఎన్నికలు ‘దీదీ వర్సెస్ బీజేపీ’ అని  అభివర్ణించినఆమె.. మొత్తం 294 నియోజకవర్గాల్లోనూ ఈ ఫైట్ తనకు, బీజేపీకి మధ్యే అని వ్యాఖ్యానించారు. తృణమూల్ కాంగ్రెస్ నుంచి  బీజేపీలో చేరుతున్నవారు ఆ తరువాత తమ నిర్ణయంపై పునరాలోచించుకుంటారని మమత పేర్కొన్నారు. కాగా  ఈ  ర్యాలీ సందర్భంగా బెంగాలీ స్టార్స్ కొందరు తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. మమతా బెనర్జీ నాయకత్వం పట్ల  తమకు పూర్తి నమ్మకం ఉందని వారు తెలిపారు.

మరిన్ని చదవండి ఇక్కడ :

నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తోన్న తెలుగు తేజం పి .వి సింధు.:PV Sindhu Inspiration For Today’s Generation Youth video

స్పర్మ్ డొనేట్ చేస్తే లక్షల్లో డబ్బులు..డబ్బులు లేక చేసిన పని లక్షల్లో ఆదాయం చూపింది : Sperm Donor Video.