India vs Australia Test: చరిత్రలో ప్రత్యేకంగా నిలవనున్న అహ్మదాబాద్ మ్యాచ్.. టాస్ వేయనున్న ప్రధాని మోడీ..
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బోర్డర్ గావస్కర్ ట్రోఫీ 2023 చివరి దశకు చేరుకుంది. నేడు అహ్మదాబాద్ వేదికగా నాలుగో టెస్టు జరగనుంది.. చివరి టెస్ట్ మ్యాచ్‌లో గెలుపుకోసం ఇరుజట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బోర్డర్ గావస్కర్ ట్రోఫీ 2023 చివరి దశకు చేరుకుంది. నేడు అహ్మదాబాద్ వేదికగా నాలుగో టెస్టు జరగనుంది.. చివరి టెస్ట్ మ్యాచ్‌లో గెలుపుకోసం ఇరుజట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే, ఇవాళ జరుగనున్న ఈ మ్యాచ్ చాలా ప్రత్యేకంగా నిలువనుంది. ఎందుకంటే..ఈ మ్యాచ్‌కు భారత ప్రధాని మోదీతో పాటు..ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని ఆల్బనీస్ హాజరుకానున్నారు. వీరిద్దరూ కలిసి భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌ను వీక్షించనున్నారు. ముఖ్యంగా ఈ మ్యాచ్ టాస్ ప్రధాని మోదీ వేయనున్నారు.
ప్రపంచంలోనే పెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనున్న ఈ మ్యాచ్‌ను చూసేందుకు ఇద్దరు ప్రధానులు వస్తుండటంతో ఫుల్ క్రేజ్ వస్తోంది. నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు అభిమానులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇద్దరు ప్రధానులు హాజరవుతున్న నేపథ్యంలో అధికారులు పకడ్భందీ ఏర్పాటు చేశారు.
ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్ పట్టేయాలని రోహిత్ సేన తహతహలాడుతుంటే.. అటు అసీస్ థర్డ్ టెస్ట్ ఫలితాన్ని రిపీట్ చేసి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది. దీంతో ఫైనల్ టెస్ట్‌లో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది.




అయితే వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ లో ఫైనల్స్ కు చేరాలంటే చివరిదైన నాలుగో టెస్టులో టీమిండియా తప్పక నెగ్గాల్సిన పరిస్థితి. ఒకవేళ ఓడినా, డ్రా చేసుకున్నా భారత్ ఫైనల్ చేరాలంటే శ్రీలంక, కివీస్ టెస్టు సిరీస్ పై ఆధారపడాల్సి ఉంటుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..
