Corona Virus: మనదేశంలో అంటువ్యాధి దశ నుంచి సాధారణ వ్యాధిగా మారిన కరోనా.. ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా…

Corona Virus: ప్రపంచంలోని యూరోపియన్ దేశాల సహా అనేక దేశాలలో కరోనా వైరస్ సృష్టిస్తున్న కల్లోలం కొనసాగుతూనే ఉంది. అయితే మన దేశంలో క్రమంగా కరోనా కొత్త..

Corona Virus: మనదేశంలో అంటువ్యాధి దశ నుంచి సాధారణ వ్యాధిగా మారిన కరోనా.. ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా...
Covid
Follow us
Surya Kala

|

Updated on: Nov 17, 2021 | 1:02 PM

Corona Virus: ప్రపంచంలోని యూరోపియన్ దేశాల సహా అనేక దేశాలలో కరోనా వైరస్ సృష్టిస్తున్న కల్లోలం కొనసాగుతూనే ఉంది. అయితే మన దేశంలో క్రమంగా కరోనా కొత్త కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. అంతేకాదు ప్రపంచంలోనే కరోనా వైరస్ సాధారణ వ్యాధిగా చేరుకున్న మొట్టమొదటి దేశంగా భారత్ అవతరించిందని డాక్టర్ టి జాకబ్ జాన్,  డాక్టర్ ఎంఎస్ శేషాద్రి చెప్పారు.

కోవిడ్ మహమ్మారి అనేక దేశాల్లో రోజువారీ సంఖ్యల నమోదు ఎక్కువగానే ఉన్నాయి. అయితే  మనదేశంలో 27వ తేదీ  జూన్ 2021 నుంచి అంటువ్యాధి దశ నుండి సాధారణ వ్యాధిగా మారింది. ఇదే దశ గత 140 రోజున నుంచి నవంబర్ 14 వరకూ కొనసాగిందని చెప్పారు. అయితే మనం కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డామా అంటే.. అవుననే గణాంకాలు తెలుపుతున్నాయని చెప్పారు. సెకండ్ వేవ్ ఉదృతి తగ్గిన అనంతరం ఇటీవలే సాధారణ దశలోకి ప్రవేశించామని.. చెప్పారు. మొదటి వేవ్ లోని వేరియంట్ కంటే రెండవ వేవ్ లోని డెల్టా వేరియంట్ తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందింది. అయితే ఇటీవలి వెలుగులోకి వచ్చిన కొత్త వేరియంట్  AY.4.2 వేరియంట్ కు వ్యాపించే లక్షణాలు అతితక్కువగా ఉన్నాయని చెప్పారు.  తద్వారా వ్యాప్తి నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది. దీంతో కరోనా అంటువ్యాధి నుంచి కోలుకుంటున్న ప్రపంచంలోనే మొదటి దేశంగా భారతదేశం అవతరించింది.

అంటువ్యాధి అంటే రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య అధికంగా ఉంటుంది. అదే సాధారణ వ్యాధిగా చేరుకుంటే కేసుల సంఖ్య తగ్గుతుంది. ఇందుకు ఉదాహరణగా రోజు రోజుకీ నమోదవుతున్న కేసుల సంఖ్యే అని చెప్పారు. దీనికి కారణం తగ్గుతున్న ఇన్‌ఫెక్షన్‌ తో పాటు, వ్యాక్సినేషన్ వేయడంలో ఉన్న ప్రగతి కారణమని చెప్పారు.

అంటువ్యాధి .. సాధారణ వ్యాధి ఈ రెండు దశలలో ఒకే లక్షణాలు ఉంటాయని.. గర్భిణీ స్త్రీలు, 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు, అవయవ మార్పిడి, క్యాన్సర్‌ వ్యాధిగ్రస్థులు, మొదటి సారి గర్భధారణ సమయంలో ఉన్నవారు బూస్టర్ డోస్ లను తీసుకోవాలని తద్వారా వైరస్ వ్యాప్తి నిరోధించబడుతుందని చెప్పారు. ముఖ్యంగా పాఠశాల్లో టీకాకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ప్రస్తుతం, ఇతర దేశాలలో, మహమ్మారి ఉధృతం కొనసాగుతుండగా.. ప్రపంచంలో అంటువ్యాధిగా అంతరించి సాధారణ వ్యాధిగా మారిన ఏకైక దేశం భారతదేశమని చెప్పారు. స్థానిక కోవిడ్-19ని ఎలా ఎదుర్కోవాలో ప్రపంచానికి చూపించడానికి ఇది మనకు ఒక చారిత్రాత్మక అవకాశమని డాక్టర్ టి జాకబ్ జాన్,  డాక్టర్ ఎంఎస్ శేషాద్రి చెప్పారు.

Also Read:  చరిత్ర పుటలో కనిపించని వీరుడు..19 ఏళ్లకే దేశస్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన కర్తార్ సింగ్..