Karnataka: యాచకుడి అంతమ యాత్రకు తరలొచ్చిన వేలాది మంది.. వైరల్ అయిన వీడియో..

జీవితంలో చాపు, పుట్టుక సహజం. ప్రతి ఒక్కరు ఎప్పటికైనా పోవాల్సిందే. అయితే ప్రస్తుతం సమాజంలో బంధువులు ఎవరైనా చనిపోతే వెళ్లలేని స్థితిలో ఉన్నారు కొంత మంది. విదేశాల్లో ఉన్నవారైతే డబ్బులు పంపిస్తాం తర్వాతి కార్యక్రమం కానివ్వండి అని ఫోన్ చేస్తున్నారు. తల్లిదండ్రులు చనిపోయినా రావడం లేదు....

Karnataka: యాచకుడి అంతమ యాత్రకు తరలొచ్చిన వేలాది మంది.. వైరల్ అయిన వీడియో..
Funeral
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 17, 2021 | 12:43 PM

జీవితంలో చాపు, పుట్టుక సహజం. ప్రతి ఒక్కరు ఎప్పటికైనా పోవాల్సిందే. అయితే ప్రస్తుతం సమాజంలో బంధువులు ఎవరైనా చనిపోతే వెళ్లలేని స్థితిలో ఉన్నారు కొంత మంది. విదేశాల్లో ఉన్నవారైతే డబ్బులు పంపిస్తాం తర్వాతి కార్యక్రమం కానివ్వండి అని ఫోన్ చేస్తున్నారు. తల్లిదండ్రులు చనిపోయినా రావడం లేదు. అలాంటి స్థితిలో ఉన్న మనకు కనువిప్పు కలిగేలా.. ఓ ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై మరణించిన మానసిక వికలాంగుడైన యాచకుడికి అంతిమ వీడ్కోలు పలికేందుకు వేలాదిగా తరలి వెళ్లారు.

కర్ణాటకలోని విజయ్‎నగర్ జిల్లా హడగలి పట్టణంలో నవంబర్ 12వ తేదీన హుచ్చా బస్యా (45) అనే వ్యక్తిని బస్సు ఢీకొట్టడంతో.. ఆస్పత్రిలో చేర్పించారు. కానీ అతడు చనిపోయాడు. అతని అంతమ సంస్కారాలకు వేలాది మంది తరలి వచ్చారు. బస్యా అంతిమ సంస్కారాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అతని పట్ల తమకున్న గౌరవాన్ని తెలియజేయడానికి వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. అతని పార్థివదేహాన్ని ఆర్టీరియల్ రోడ్డు మీదు అంతమయాత్ర నిర్వహించారు.

బస్యా ఒక వ్యక్తి నుంచి 1 రూపాయి మాత్రమే భిక్షగా తీసుకునేవాడని అక్కడి వారు చెబుతున్నారు. రూపాయి కంటే ఎక్కువ ఇస్తే అదనపు మొత్తాన్ని తిరిగి ఇచ్చేవాడని ప్రజలు గుర్తు చేసుకున్నారు. బలవంతం చేసినా ఎక్కువ డబ్బు తీసుకోడని చెప్పారు. బస్యాకు అన్నదానం చేస్తే అదృష్టం వస్తుందని స్థానికులు నమ్మారు. ఆయన ఏం మాట్లాడినా అది నిజమేనని, అందుకే ఆయనపై ప్రజల్లో గౌరవం ఉందని స్థానికుడు ఒకరు తెలిపారు.

Read Also… UNSC: ఆక్రమణలు తక్షణమే ఖాళీ చేయాల్సిందే.. భద్రతామండలి వేదికగా పాకిస్తాన్‌కు తేల్చి చెప్పిన భారత్!